Movies

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమా సెన్సార్ అవ్వటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా ?

పౌరాణిక సినిమాల్లో తనకు తానే సాటిగా నిల్చిన నటరత్న ఎన్టీఆర్ సినిమాలను వదిలేసి రాజకీయ రంగంలో చేరి, 9మాసాల్లో అధికారంలోకి వచ్చాక విడుదలైన సినిమా శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమా నిజంగా ఓ సంచలనంగా నిల్చింది. 1984లో భారీ హైప్ తో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది. రాజకీయాల్లోకి రాకముందే తీసిన ఈ సినిమా దాదాపు ఐదేళ్లు ఎన్నో సమస్యలను అధిగమించి సీఎం అయ్యాక విడుదలైంది.

సినిమా ఎందుకు ఆలస్యం అయింది, ఇందులో సంచలనం కల్గించే అంశాలు ఎన్ని ఉన్నాయి వంటి విషయాల్లోకి వెళ్తే,1979లోనే కలల ప్రాజెక్ట్ గా ఎన్టీఆర్ ఈ సినిమాను స్టార్ట్ చేసారు. అయితే మిగిలిన సినిమాల డేట్స్ వలన ఈ సినిమా లెటయ్యి,1981లో షూటింగ్ పూర్తయింది. అయితే శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర లో ఇందిరా గాంధీ గురించి కొన్ని సెటైర్స్ ఉన్నాయని అవి తొలగిస్తేనే పర్మిషన్ ఇస్తామని సెన్సార్ బోర్డు తేల్చేసింది. కానీ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు.

ఎన్టీఆర్ కోర్టుకి వెళ్లడంతో కోర్టు ఆదేశంతో ఈ మూవీ మళ్ళీ సెన్సార్ కి వెళ్ళింది. విధవ రాజ్యమేలును అనే పదం ఇందిరా గాంధీ గురించేనని అందుకే అది తొలగించాలని సెన్సార్ బోర్డు చెప్పింది. అలాగే ఏమండి పండితులారా అని బ్రాహ్మణులను అవమానించారని అవి కూడా తొలగించాలని చెప్పారు. కానీ తీయకుండా కోర్టులో పోరాటం చేస్తూ వచ్చారు. ఇక సీఎం అయ్యాక తన పలుకుబడితో సినిమా రిలీజ్ చేసారు. కొన్ని సీన్స్ తీసేసినా సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఇక రంగేసుకున్నవాళ్లు రాజ్యమేలుదురు అని కూడా ఈ సినిమాలో ఉంటుంది. కానీ ఇది 1979లోనే ఇది చిత్రీకరించారు. కానీ కొన్నేళ్ళకు నిజంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టి,సీఎం అయ్యారు.