Movies

చాన్నాళ్లకు ఒక కొత్త సినిమాతో రాబోతున్న “జీ తెలుగు”

మన టాప్ తెలుగు ఛానెల్స్ లో ఈ లాక్ డౌన్ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతున్న ఛానెల్ ఏదన్నా ఉంది అంటే అది జీ తెలుగు ఛానెల్ అని చెప్పాలి. అన్ని ఛానెల్స్ వారు సరికొత్త సినిమాలతో అదరగొట్టేస్తూ తమ వీక్షకులకు వీకెండ్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుండగా ఈ విషయంలో మాత్రం కాస్త వెనుకబడిపోయింది

కానీ ఇప్పుడు ఎట్టకేలకు వీరు కూడా ఒకసారికొత్త సినిమాను తీసుకు వస్తున్నట్టు తెలుపుతున్నారు. అదే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ మరియు లావణ్య త్రిపాఠిల కలయికలో టి సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “అర్జున్ సురవరం”.

మంచి క్రైమ్ మరియు సస్పెన్స్ సహా మంచి మెసేజ్ తో కూడుకున్న ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేయనున్నట్టు తెలుపుతున్నారు. ఇంకా తేదీ ఖరారు చెయ్యలేదు కానీ అతి త్వరలోనే టెలికాస్ట్ చేయబోతున్నట్టు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత ఒక సరికొత్త సినిమాను వీరు తీసుకొస్తున్నారు. ఇది ఈ సమయంలో ఎంత త్వరగా టెలికాస్ట్ చేస్తే అంత మంచిది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."