ప్రేక్షకుల ముందుకు మరో థ్రిల్లింగ్ సినిమాతో జెమినీ టీవీ.!
గత ఏడాది ఎండింగ్ నుంచి జెమినీ టీవీ వారు మన తెలుగులో అన్ని ముఖ్య సినిమాల తాలూకా సాటిలైట్ హక్కులను కొనుగోలు చేసేసి వాటిని ఒక్కో వారం చొప్పున టెలికాస్ట్ చేసారు. అలా ఇప్పుడు మళ్ళీ ఈ ఏడాదిలో కూడా విడుదల కాబడిన చాలా చిత్రాల శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసేసారు. అలా తీసుకున్న సినిమాలను ఇప్పుడు వరుస పెట్టి టెలికాస్ట్ చెయ్యడం కూడా మొదలు పెట్టారు.
ఇప్పటికే రాబోతున్న శుక్రవారాలు “హిట్” మరియు “లోకల్ బాయ్” సినిమాలను టెలికాస్ట్ చెయ్యనుండగా వీటి తర్వాత మరో అదిరిపోయే సినిమాను టెలికాస్ట్ చెయ్యనున్నారు. వచ్చే మే నెల మొదటి రెండు శుక్రవారాల్లో ఈ రెండు సినిమాలను లైన్ లో ఉంచగా మూడో శుక్రవారం నాగశౌర్య మరియు మెహ్రీన్ లు నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ చిత్రం “అశ్వథ్థామ” చిత్రాన్ని టెలికాస్ట్ చెయ్యనున్నారు. ఇలా జెమినీ ఛానెల్ వారు మాత్రం మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పాలి.