Movies

లాక్ డౌన్ సమయంలో సంపూర్ణేష్ బాబు ఏమి చేస్తున్నాడో తెలుసా?

కామెడీ హీరోనే అయినా అనూహ్యమైన స్టార్‌డమ్ అతని సొంతం. ఎంత ఎదిగినా, ఒదిగి వుండడమే ఆయనకు తెలిసిన నిజం. అవును, సంపూర్నేష్‌బాబు ఎప్పుడూ హీరోలా కన్పించడు. పరిపూర్ణమైన వ్యక్తిత్వం వున్నవాడిలా కన్పిస్తాడు. మనోడే, పన పక్కింటివాడే.! తెరపై ఏం చేసినా, రియల్‌ లైఫ్‌లో చాలా సింపుల్‌గా వుంటాడు. తెలంగాణకు చెందినోడైనా, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో పోరాడాడు. నిజాన్ని నిర్భయంగా చెబుతాడు. పెద్దల పట్ల విధేయత విషయంలో సంపూకి పరిపూర్ణమైన మార్కులు పడతాయి.

‘బి ది రియల్‌ ఛాలెంజ్‌’ విషయంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు సంపూర్ణేష్‌బాబు. ‘కంసాలి’ కుటుంబానికి చెందిన సంపూ, సినిమాల్లేకపోతే తన కులవృత్తి అయిన ‘గోల్డ్‌ స్మిత్‌ వర్క్‌’ చేస్తుంటాడు. ‘బి ద రియల్‌ మేన్‌’ ఛాలెంజ్‌ సందర్భంగా అదే చేశాడు. తన భార్యకీ, తన కుమార్తెలకూ అవసరమైన ఆభరణాలు వెండితో చేశాడు. ‘రాజు పేద తేడా లేదు.. నీ ఆస్తి, డబ్బు నీ వెనుక రావు.. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు. గుర్తు చేసుకుంటున్న సమయం ఇది. మా ఆవిడ, పిల్లల కోసం నా ‘కంశాలి’ వృత్తిని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేశాను..’ అంటూ సంపూర్ణేష్‌ ట్విట్టర్‌లో చెప్పిన విషయం, పోస్ట్‌ చేసిన వీడియో నిజంగానే అందర్నీ ఆలోచింపజేస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."