రానాతో ఉన్న రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్..!

దగ్గుబాటి రానాకి రకుల్ ప్రీత్‌కి ఏదో ఎఫైర్ నడుస్తుందంటూ చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రానాకు చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్ ఉందంటూ ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. మొదట్లో త్రిషతో చాలా ఏళ్ళ పాటు రానా ఎఫైర్ నడిపాడంటూ చెన్నై మీడియాతో పాటు తెలుగు మీడియా కూడా చెప్పసాగింది.

అయితే ఎవరు ఎన్ని అనుకున్నా రానా మాత్రం వాటన్నిటికి నవ్వుతూనే సమాధానమిస్తాడు. తనపై వార్తలు రాసేవాళ్ళకు రాసి రాసి అలుపొస్తుందేమో కానీ తనకు మాత్రం రాదంటూ నేనెప్పటికీ మారను, నన్ను చూసి వాళ్ళే మారాలంటూ సమాధానాలు కూడా ఇచ్చాడు. అయితే ఇప్పుడు రకుల్ వ్యవహారంపై కూడా రానా అసలు స్పందించడం లేదు. కానీ రకుల్ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రానాతో డేటింగ్ విషయంపై చెబుతూ ప్రస్తుతం తానెవరితోనూ డేటింగ్ చేయడం లేదని ఇప్పటికి తాను సింగిల్ అనే చెప్పేసింది. ఇకపోతే మంచు లక్ష్మి, రానా తనకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని మా ఇల్లు, రానా ఇల్లు పక్క పక్కనే కావడంతో అంతా తమ క్లోజ్ నెస్ చూసి ఏదో ఉందని అనుకుంటున్నారని తమ మధ్యన ఉన్నది కేవలం స్నేహం మాత్రమే తప్పా మరింకేది లేదని క్లారిటీ ఇచ్చేసింది.