Movies

మరిన్ని అలనాటి సీరియల్స్ తో ఈటీవీ..డోంట్ మిస్.!

తెలుగు టాప్ 3 ఎంటర్టైనింగ్ ఛానెల్స్ లో ఈటీవీ ఛానెల్ కూస్తో ఒకటి. ఇప్పుడున్న సీరియల్స్ కన్నా ఒకప్పుడు టెలికాస్ట్ చేసిన సీరియల్స్ కు అయితే ఎనలేని ఆదరణ ఉంది. అలా అని ఇప్పుడున్న సీరియల్స్ బాగోలేవని కూడా కాదు. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారుగా అలా..ఈ లాక్ డౌన్ కారణంగా అన్ని ఛానెల్స్ తో పాటుగా ఈటీవీ ఛానెల్లోని సీరియల్ షూటింగులు కూడా నిలిచిపోయాయి.

దీనితో ఈటీవీ వారు తమ అలనాటి అద్భుతమైన ధారావాహికలను మరోసారి తమ వీక్షకులకు అందిస్తున్నారు. అలా “అలౌకిక” సీరియల్ తో మొదలు కొని “మనోజయం”, “అంతరంగాలు” మరియు “శాంతినివాసం” ధారావాహికలను అందిస్తున్నారు.అయితే ఈ సీరియళ్లను నేరుగా టెలివిజన్ తెరపై కాకుండా తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఈ లాక్ డౌన్ సమయంలో ఖచ్చితంగా ఇవి ఈటీవీ అభిమానులకు మరోసారి అద్భుతమైన అనుభూతిని ఇవ్వడం ఖాయం అని చెప్పాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."