Movies

హరనాధ్ ఎందుకు పతనమయ్యారో తెలుసా….నమ్మలేని నిజాలు

ఎన్టీఆర్,అక్కినేని లతో సమానంగా స్టార్ హీరోగా ఎదగాల్సిన అందాల నటుడు హరనాధ్ కి సీన్ రివర్స్ అయింది. 1936జన్మించిన హరనాధ్ చిన్నవయస్సులోనే మరణించారు. ఆయన జీవితం ఎందుకు విషాదంగా ముగిసిందనే దానిపై రకరకాల వాదనలు ఉన్నాయి. కాలేజ్ డేస్ లో డ్రామాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1959లో 23ఏళ్ళ వయసులో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. రుష్య శృంగ మూవీ లో యాక్ట్ చేసినా, అది ఆలస్యంగా అంటే1961లో విడుదలైంది. కానీ ముందుగా రిలీజయిన మాయింటి మహాలక్ష్మి మూవీ తొలిసినిమా అయింది. ఇక శ్రీ సీతారామ కళ్యాణం మూవీలో రాముడిగా నటించిన హరనాధ్ కి ఆ సినిమా మంచి పేరు తెచ్చింది.

ఆతర్వాత గుండమ్మ కథ,భీష్మ,అమరశిల్పి జక్కన్న ,మురళీకృష్ణ, చిట్టిచెల్లెలు, లేతమనసులు,బొబ్బిలి యుద్ధం, మొనగాడికి మొనగాడు,భక్త ప్రహ్లాద, సుఖ దుఃఖాలు,బాల భారతం వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. శోభన్ బాబు, నాగార్జున ,ఇప్పుడు మహేష్ బాబు అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎలా గుర్తింపు ఉందొ హరనాధ్ కి అంతటి గుర్తింపు ఉండేది. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి అమ్మాయిలు కార్లలో హరనాధ్ షూటింగ్ జరిగే ప్లేస్ కి వచ్చి కుదిరైతే ఫోటో దిగి వెళ్లేవారు. అంతటి లేడీ ఫాలోయింగ్ గల నటుడు గా హరనాధ్ కి పేరుంది. అయితే మద్యపానం హరనాధ్ ని విషాదంలోకి నెట్టేసింది.

కానీ ఎన్టీఆర్,అక్కినేని కావాలనే హరనాధ్ ని తొక్కేశారనే పుకార్లు ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే హరనాధ్ ని ఎన్టీఆర్ ఎంతగానో ఎంకరేజ్ చేసారని,సీతారామ కళ్యాణం మూవీలో రాముడిగా చేసే ఛాన్స్ ఉన్నా, ఆ పాత్రను హరనాధ్ చేత వేయించారని చెబుతుంటారు. అక్కినేని కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు. మద్యపానం వ్యసనంగా మారడంతో తాగి షూటింగ్ కి కూడా వచ్చి కెరీర్ పాడుచేసుకున్నారు. తాగి తాగి మొహం మారిపోయింది. దీంతో బయటకు రాలేక సినిమాలు కూడా వదిలేసాడు. ఇంట్లోనే ఒక గదిలో విడిగా ఉండేవారు. 1972తో వదిలేసిన సినిమాల్లోకి మళ్ళీ 1981లో ఎంటర్ అయ్యారు. ఓ సినిమాలో నటించి,మరో సినిమా నిర్మించారు. అయితే ఆర్ధిక ఇబ్బందులు వెంటాడాయని అంటారు. కానీ ఈయన జమీందారీ కుటుంబం వలన డబ్బుకి లోటు లేదు. రాజేంద్రప్రసాద్ నటించిన తోడల్లుళ్లు మూవీలో ఆఖరిసారిగా నటించిన హరనాధ్ 1989నవంబర్ 1న కన్నుమూశారు.