Movies

పూరి జగన్నాథ్,మహేష్ మధ్య విభేదాలు ఉన్నాయా…అందుకే ఆలా చేశాడా…!

పూరి జగన్నాథ్‌ – మహేష్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’ సినిమా 14 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ కెరీర్‌లోనే కాదు, పూరి జగన్నాథ్‌ కెరీర్‌లోనూ అదో స్పెషల్‌ ఫిలిం. ఆ మాటకొస్తే, ‘పోకిరి’ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అది వెరీ వెరీ స్పెషల్‌ ఫిలిం. అంత పెద్ద విజయం సాధించింది ఆ సినిమా. ‘పోకిరి’ 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సూపర్‌ స్టార్‌ అభిమానులు, సోషల్‌ మీడియా వేదికగా హల్‌చల్‌ చేశారు. ‘పోకిరి’ని ట్రెండింగ్‌లో వుంచారు. లక్షల కొద్దీ ట్వీట్లు పడ్డాయి ‘పోకిరి’ పైన. ఈ సినిమా గురించి పూరి జగన్నాథ్‌ కూడా తనదైన స్టయిల్లో ట్వీటేశాడు. అయితే, హీరో మహేష్‌బాబుని ట్యాగ్‌ చెయ్యకపోవడం పూరిని వివాదాల్లోకి నెట్టింది.

పూరి జగన్నాథ్‌కీ, మహేష్‌బాబుకీ మధ్య విభేదాలున్నాయంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఆ ప్రచారానికి నిన్నటి పూరి ట్వీట్‌ ఆజ్యం పోసిందా.? అంటే, ఔననే అభిప్రాయం మహేష్‌ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. కానీ, ఇక్కడ పూరి, మహేష్‌నే కాదు.. ఇంకెవర్నీ ట్యాగ్‌ చేయలేదు. అభిమానులు మాత్రం, పూరిపై విమర్శలతో విరుచుకుపడిపోయారు. అభ్యంతరకరమైన కామెంట్ల సంగతి సరే సరి. ఆ విషయాన్ని పక్కన పెడితే పూరి – మహేష్‌ కలిసి మరో సినిమా (బిజినెస్‌మెన్‌) కూడా చేశారు. ఇద్దరి కాంబినేషన్‌లో ఇంకో సినిమా రావాల్సి వుంది. కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్‌ వాయిదా పడుతూ వస్తోంది. అదే ‘జనగనమన’.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."