Movies

జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి సినిమా పాటల వెనక ఎంత స్టోరీ ఉందో…?

‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి’.. ఈ సెల్యులాయిడ్ వండ‌ర్ వెనుక ఎంతోమంది ఛాంపియ‌న్స్‌.. సినిమాలోని ప్ర‌తి ఫ్రేమ్‌నీ మ్యాజిక‌ల్‌గా చూపించిన డీఓపీ విన్సెంట్ గారు.. అంద‌మైన సెట్స్‌తో మైమ‌ర‌పింప‌జేసిన ఆర్ట్ డైరెక్ట‌ర్ చ‌లం గారు.. ఎడిటింగ్ స్కిల్‌తో సినిమాకి సూప‌ర్‌ టెంపోనిచ్చిని మ‌న చంటి గారు.. పాట‌లు, మాట‌ల‌తో మెస్మ‌రైజ్ చేసిన వేటూరి గారు, జంధ్యాల గారు.. వీళ్లంద‌రి క‌ష్టానికి ప్రాణం పోశారు ఒక లెజెండ్‌.. ఒకే ఒక్క మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా! ప్ర‌తి పాట వెనుకా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. అలాంటి కొన్ని స్టోరీస్ మీకు చెప్ప‌నా! ఒక పాట ట్యూన్‌ని ఇళ‌య‌రాజా కంపోజ్ చేశారంట‌. కానీ పాట విని, ‘అన్నీ మెలోడీ క్లాస్ సాంగ్స్ అయిపోతున్నాయ్‌.. చిరంజీవి గారు, శ్రీ‌దేవి గారు అంటే మాస్ సాంగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు క‌దా?’.. అని గ‌ట్టిగానే అభ్యంత‌రం వ‌చ్చింది.

రాఘ‌వేంద్ర‌రావు గారు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. కానీ ద‌త్ గారికి రాజా గారి ట్యూన్ మార్చ‌డం ఇష్టం లేదు. అప్పుడు వేటూరి గారు.. మ‌హానుభావుడు..”ఇదే ట్యూన్‌ని మాస్ సాంగ్ చేస్తాను చూడండి”.. అన్నారు. అలా ‘అబ్బ నీ తీయ‌నీ దెబ్బ’ రాశారు. క్లాస్ ట్యూన్‌ని తెలుగు సినిమా హిస్ట‌రీలో బిగ్గెస్ట్ మాస్ ట్యూన్‌గా త‌యారు చేశారు ఆ ఇద్ద‌రు లెజెండ్స్‌.. ఇళ‌య‌రాజా అండ్ వేటూరి. ఇందులో మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ పాట‌ని డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు గారు మైసూర్‌, బెంగ‌ళూర్‌ల‌లో జ‌స్ట్ రెండే రోజుల్లో ఫినిష్ చేశారు. అదే మ‌ళ్లీ మ‌రో సాంగ్‌లో దేవ‌క‌న్య మొద‌టిసారి మాన‌స స‌రోవ‌రానికి రావ‌డం, ‘అందాల‌లో మ‌హోద‌యం’ పాట పిక్చ‌రైజ్ చేయ‌డానికి రాఘ‌వేంద్ర‌రావు గారు 11 రోజులు టైమ్ తీసుకున్నారు. మ‌రో పాట.. ‘ధిన‌క్ తా ధిన‌క్ రో’.. ఈ పాట‌కు కూడా వాహినీ స్టూడియోలోనే భారీ సెట్ వేశారు. షూటింగ్ అయిపోగానే శ్రీ‌దేవి గారు హిందీ సినిమా షూటింగ్‌కు ఫారిన్ వెళ్లిపోవాలి. స‌రిగ్గా అదే టైమ్‌కు చిరంజీవి గారికి 104 డిగ్రీల హై ఫీవ‌ర్‌! ఒళ్లు కాలిపోతోంది.

ఒ ప‌క్క‌న రిలీజ్ డేట్ మే 9! ఒక్క రోజు తేడా వ‌చ్చినా మొత్తం తేడా వ‌చ్చేస్తుంది. అప్పుడు చిరంజీవి గారు హై ఫీవ‌ర్‌తోనే షూటింగ్‌కు రెడీ అయ్యారు. సెట్‌లోనే డాక్ట‌ర్‌.. చిరంజీవి గారు శ్రీ‌దేవి గారితో డాన్స్‌.. అస‌లెక్క‌డైనా చిన్న తేడా అయినా క‌నీసం క‌నిపించిందా స్క్రీన్ మీద‌! అదీ చిరంజీవి గారంటే!! ఆ సంఘ‌ట‌న‌ను ఎప్పుడూ త‌ల‌చుకుంటుంటారు ద‌త్ గారు. అనుకున్న డేట్‌కు అనుకున్న‌ట్లు రిలీజ్ చెయ్య‌గ‌లిగామంటే దానికి ఆయ‌న‌కు వ‌ర్క్ అంటే ఉంటే డెడికేష‌న్ ముఖ్య కార‌ణ‌మ‌ని మ‌న‌సారా మెచ్చుకుంటారు. అందుకే.. ఒక్క కార‌ణం కాదు, ఎన్నో యాంగిల్స్‌లో ‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి’ తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే ఒక వండ‌ర్‌, ఒక మైల్ స్టోన్‌! ఎవ‌రూ ఎప్ప‌టికీ రిపీట్ చేయ‌లేని హిస్టారిక‌ల్ ల్యాండ్ మార్క్‌.