Movies

సెల్ ఫోన్ వాడని మన టాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరు?

సెల్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక ఒక భాగం అయిపోయింది. ప్రతిదానికి ఫోన్ తోనే పని ఉంటుంది. ప్రపంచం కుగ్రామంగా మారిపోయిన ఈ రోజుల్లో, సెల్ లేకపోతే మన బాడీ లో ఒక పార్ట్ లేనట్టు అనిపిస్తుంటుంది. అయితే జనమంతా సెల్ కు ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్న ఈ రోజుల్లో , ఫోన్ను ఒక వస్తువుగా భావించి , అసలు ఏమాత్రం ఇంపార్టెంట్ ఇవ్వని హీరోలు కూడా ఈ రోజుల్లో ఉన్నారు.ఉన్నారా అంటే ఉన్నారని చెప్పొచ్చు
.మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. అసలు తనకు ఫోన్ ఎప్పుడు అందుబాటులో ఉండదని.. తను అసలు పట్టించుకోను అనేశారు.
ఇంతకీ ఏ సందర్భంలో అంటే ఒక టైంలో ఇంటర్వ్యూలో యాంకర్ సుమ గారు అడిగిన ఓ ప్రశ్నకు మహేష్ బాబు ఆసక్తికర సమాధానం చెప్పారు.

రాపిడ్ ఫైర్ క్వషన్స్ అంటూ సుమ అడిగారు. అసలు మీ ఫస్ట్ ఎస్ఎంఎస్ మీకు గుర్తుందా ?. అనేది ప్రశ్న. దానికి మహేష్ బాబు గారు సర్ ప్రైజింగ్ గానే సమాధానం చెప్పారు.. నాకసలు గుర్తులేదు అనేశారు. నేనెప్పుడూ షూటింగ్స్ లో ఫోన్ వాడను. ఒకవేళ మా ఆవిడ ఫోన్ చేసినా నా మేకప్ మాన్ లేదా డ్రైవర్ కానీ ఫోన్ ఇస్తేనే మాట్లాడతాను. నా దగ్గర సెల్ ఉండదు. అలాంటప్పుడు ఎస్ ఎం ఎస్ ఏం తెలుస్తుంది, అని షాక్ ఇచ్చారు . మీకంటూ ఫోన్ లేదా అని సుమ అడగగా , ఉంది కానీ …అది ఎక్కడ ఉంటుందో తెలియదు . ఫోన్ విషయంలో నేను చాలా బ్యాడ్. పెద్దగా పట్టించుకోను. మీకు నమ్రతతో పెళ్లి కాకపోయి ఉంటే ఫోన్ చాలా అవసరం ఉండేదేమో, అని సుమ అడగ్గా, అప్పుడు కూడా అస్సలు వాడే వాడిని కాదేమో అని చెప్పారు. ఈ స్మార్ట్ యుగంలో లో కూడా ఫోన్ వాడని ఒక స్టార్ హీరో ఉన్నాడని దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు..