Devotional

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి సర్వం సిద్దం.. కానీ కండిషన్స్ అప్లై..!

కరోనా వైరస్ మహమ్మారి ప్రజల పై, సమాజం పై మాత్రమే కాకుండా, దేవాలయాల పై కూడా పడింది. ఎక్కువగా సమూహంలో ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో దేవాలయాలు సైతం మూసి వేశారు. అయితే ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం కోసం ప్రస్తుతం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పలు కండిషన్స్ అనుసరించాల్సి ఉంది.

అయితే దర్శనానికి సంబందించిన టికెట్లను ఆన్లైన్ లో ముందుగా బుక్ చేసుకునేందుకు వీలుగా పలు చర్యలు చేపట్టింది. మొబైల్ ఫోన్ ద్వారా స్లాట్ ను బుక్ చేసుకొనేందుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అయితే ఇలా బుక్ చేసుకున్న స్లాట్ ను 24 గంటలు ముందుగా కన్ఫర్మ్ అయ్యేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే ఆలయంలో గంటకు 250 మంది భక్తులకు మించకూడదు. అంతేకాక అమ్మవారి దర్శనం కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆధార్ నంబర్ కూడా ఈ ప్రక్రియ లో కీలకం చేశారు. అయితే శఠగోపం, తీర్థం పంపిణీ, అంతర్ ఆలయ దర్శనాలను అధికారులు నిలిపివేస్తున్నట్లు వివరించారు.