Movies

ప్రభాస్ లేకుంటే అప్పుడే చచ్చేవాడినంటున్న నటుడు… షాకింగ్ కామెంట్స్

బాహుబలి మూవీతో తెలుగు ఇండస్ట్రీలోనే కాదు దేశమంతా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి మాట్లాడుకుంటున్నారు. రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసునిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తక్కువ కాలంలోనే టాప్ స్టార్ అయ్యాడు. బాహుబలి, సాహో సినిమాలు నేషనల్ వైడ్‌గా సంచలనం సృష్టించాయి. సాహో అయితే తెలుగులో ఫ్లాప్ అయినా కూడా హిందీలో హిట్ అవ్వడంతో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఎంత మార్కెట్ పెరిగినా.. ఎంత ఇమేజ్ వచ్చినా అతడి బిహేవియర్‌లో మాత్రం ప్రభాస్ ఎప్పుడూ లో ప్రొఫైల్ లోనే ఉంటాడని అతడి సన్నిహితులు చెప్పేమాట. పైగా స్నేహితులకు ఎప్పుడూ ప్రాముఖ్యత ఇస్తుంటాడు.

అసలు విషయానికి వస్తే, 15 ఏళ్ల కింద ప్రభాస్‌తో కలిసి చత్రపతి సినిమాలో నటించిన శేఖర్ గుర్తున్నాడా..? రాజమౌళి సినిమాల్లో దాదాపు అన్నింట్లోనూ నటించాడు. విక్రమార్కుడు సినిమాలో కూడా కీలక పాత్రలో నటించాడు. చత్రపతిలో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్‌గా కనిపించి.. ఇంటర్వెల్ అప్పుడు చనిపోయే పాత్రలో నటించాడు శేఖర్. ఆ సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి శేఖర్ ఇప్పుడు గుర్తు చేసుకున్నాడు. షూటింగ్ సమయంలో ప్రభాస్ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదని.. సైలెంట్‌గా తన పని తాను చేసుకునేవాడని చెప్పాడు శేఖర్. ఓ రోజు షూటింగ్ కోసం సముద్రంలోకి వెళ్లామని.. ప్రభాస్ ఇంట్రో సీన్ కోసం ఒడ్డు కనబడకూడదని.. సముద్రం మధ్యలోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు శేఖర్.

ఆ సమయంలో విలన్ గ్యాంగ్ నుంచి తమ సరుకు కాపాడుకోడానికి సముద్రంలో తమ సరుకును దాచేస్తామని.. అప్పుడు తను నీళ్లలోకి మునిగి తీయాల్సిన సీన్ రాజమౌళి చిత్రీకరిస్తున్నాడని శేఖర్ చెప్పాడు ఆ సమయంలో తన కాళ్లు ప్రభాస్ పట్టుకుంటే.. బయటికి వచ్చిన తర్వాత కాలర్ అజయ్ పట్టుకోవాలని.. కానీ అనుకోకుండా అజయ్‌కు తన కాలర్ దొరక్కపోవడంతో ఎంత వేగంగా పైకి వచ్చానో.. అంతే వేగంగా మళ్లీ సముద్రంలోకి పడిపోయానని చెప్పాడు. ఆ సమయంలో తన కాళ్లు అస్సలు వదలకుండా అలాగే ప్రభాస్ పట్టుకున్నాడని.. చాలా సేపు వరకు అలాగే ఉన్నాడని.. లోపల తనకు ప్రభాస్ తన ప్రాణాల కోసం పడుతున్న శ్రమ అర్థం అవుతుందని చెప్పాడు. ఆ రోజు తనకేమైనా అవుతుందేమో అని ప్రభాస్ పడిన తాపత్రయం అంతా ఇంతా కాదని శేఖర్ అన్నాడు.ఆ రోజు ప్రభాస్ లేకపోతే తన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటే భయమేస్తుందని చెప్పాడు.