ఈ స్టార్ హీరో కొడుకుని గుర్తు పట్టారా..?
ఇక్కడ మనం చూసే ఫొటోలో నూనూగు మీసాలు.. ఇప్పుడిప్పుడే వస్తున్న గడ్డంతో హ్యాండ్సమ్ లుక్‌తో ఓ కుర్రాడు పిచ్చెక్కిస్తున్నాడు. అతడి పేరు అర్జున్. ఈ కుర్రాణ్ణి చూస్తుంటే మరో రెండు మూడేళ్లలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చేలా కనిపిస్తున్నాడు. ఇంతకీ ఎవరని అనుకుంటున్నారా. విక్టరీ వెంకటేష్ కొడుకు. నిజానికి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోల వారసులంతా ఇంచుమించు అందరికీ తెలుసు. గౌతమ్, అకిరా నందన్ లాంటి వాళ్లు బయట ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు. మోక్షజ్ఞ కూడా అప్పుడప్పుడూ బయటకి వచ్చాడు. కానీ వెంకటేష్ కొడుకు అర్జున్ మాత్రం ఎక్కువగా బయట కనపడడు.
అప్పుడెప్పుడో చిన్నపుడు నాన్నతో చేసిన ఫోటోషూట్.. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో ఆడియో వేడుకలో ఓ సారి తళుక్కున మెరిశాడు. మళ్లీ ఇప్పటి వరకు ఈ కుర్రాడు ఎలా ఉన్నాడో కూడా ఎవరికీ తెలియదు. కొడుకుతో పాటు కూతుళ్లు ఆశ్రిత, హయవాహిని, భావన ఫోటోలు కూడా ఎక్కువగా కనిపించవు. ఇక వెంకీ భార్య నీరజ కూడా చాలా తక్కువ సార్లు బయటికి వచ్చింది. ఇప్పుడు అంతా కలిసి ఒకేసారి కనిపించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాలా ఈవెంట్స్‌లలో దగ్గుబాటి అర్జున్ కనిపించాడు. ఇప్పుడు అన్నయ్య రానా రోకా వేడుకలో మరోసారి కనిపించాడు అర్జున్.
రానా, మిహికా జంటకి విషెస్ చెప్తూ సోషల్ మీడియాలో వాళ్ల ఫోటోలను షేర్ చేస్తున్నారు. అందులో అర్జున్ కూడా ఉన్నాడు. గతంలో అర్జున్‌ని చూసిన వాళ్లు ఇప్పుడు చూసి ” ఐదేళ్లలోనే ఈ కుర్రాడు చాలా మారిపోయాడు” షాక్ అవుతున్నారు. ముందు స్టడీస్.. ఆ తర్వాతే సినిమాలు అనేది వెంకీ సిద్ధాంతం. తాను కూడా ఇదే చేసాడు.. ఇప్పుడు కొడుకు విషయంలో కూడా ఇదే చేస్తున్నాడు. మరి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి.