నాగార్జునతో కలిసి నటించటం పెద్ద మైనస్ అని షాకింగ్ కామెంట్స్ చేసిన సుమంత్

అక్కినేని ఫ్యామిలీ నుంచి సోలో హీరోగా,వెరైటీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ ఎందుకనో అంతగా క్లిక్ అవ్వలేదు. రియల్ లైఫ్ లోనూ,అలాగే రీల్ లైఫ్ లోనూ ఒడిడుకులు తప్పలేదు. ఇటీవలే మళ్ళీరావా సినిమాతో విజయం అందుకున్నాడు. తాజాగా ‘కపటదారి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ప్రదీప్ కృష్ణమూర్తి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా కన్నడ హిట్ ఫిల్మ్ ‘కవులదారి’కి రీమేక్ అని తెలుస్తుంది. ఈ సినిమాలో సుమంత్ కి జోడిగా హీరోయిన్ నందిత శ్వేత నటిస్తోంది. ఇక తెలుగులో 2001లో విడుదలైన “స్నేహమంటే ఇదేరా” సినిమాలో హీరోలుగా అక్కినేని నాగార్జున తో కల్సి సుమంత్ నటించాడు. హీరోయిన్లుగా భూమిక చావ్లా – స్వర్గీయ ప్రత్యూష నటించారు.

బాలశేఖరన్ తెరకెక్కిం చిన ఈ సినిమా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో సుమంత్ మరోసారి ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ, ఈ సినిమా తన కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపిందో చెప్పేసాడు. ‘నిజానికి స్నేహమంటే ఇదేరా అనే సినిమాలో నేను మా చిన్న మామయ్య నాగార్జునతో నటించినప్పుడే ఏదో డౌట్ కొట్టింది. కానీ అలాగే ఈ సినిమాలో నేను నాగార్జున ఫ్రెండ్స్ అనేసరికి అదే పెద్ద మైనస్ అయింది. ఈ కేవలం మేం ఫ్రెండ్స్ అనే కారణంగానే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పరాజయం పొందింది’అని సుమంత్ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

‘అయితే నాకు ఇలాంటి ఘోరమైన అనుభవం అంతకు ముందే ఎదురైంది. నేను నా కెరీర్ మొదట్లోనే తాతయ్య అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ‘పెళ్లిసంబంధం’ అనే సినిమాలో నటించాం. అది కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యింది’అని చెప్పాడు నిజానికి మేం ఈ రెండు సినిమాల కథల విషయంలో జాగ్రత్త పడకపోవడం.. అందుకే అలా కెరీర్ మొదట్లోనే కొన్ని చేదు అనుభవాలు మా ఫ్యామిలీ వాళ్ళతోనే జరిగా యి’అని సుమంత్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి నేను మా వాళ్ళతో నటించకుండా ఉండాల్సింది అని సుమంత్ తెలిపారట. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్న సుమంత్ కెరీర్ మళ్ళీ గాడిన పడుతుందా లేదా అనేది తేలాలి.