Movies

డైరెక్టర్ గుణశేఖర్ గురించి ఎవరికీ తెలియని షాకింగ్ విషయాలు

Director GunaSekhar Unknown facts

కొందరు ఎక్కువ సినిమాలు చేసినా రానిపేరు .. కొందరు తక్కువ సినిమాలు చేసి ఎక్కువ పేరు సొంతం చేసుకుంటారు .. అందులో స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ కళ్ళు చెదిరే భారీ సెట్టింగ్స్, భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడంలో ఈయనకు ఈయనే సాటి.

ఇప్పటిదాకా 12సినిమాలు డైరెక్ట్ చేసి,మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. 5సూపర్ హిట్స్,నాలుగు ప్లాప్స్ అందుకున్నాడు. 1964జూన్ 2న మచిలీపట్నంలో జన్మించిన గుణశేఖర్ అక్కడే స్టడీస్ కంప్లిట్ చేసి,సినిమాలపై ఆసక్తితో ఆ రంగం వైపు అడుగులు వేసాడు.

మొత్తానికి చేసిన కృషి ఫలించి,డివి నరసరాజు దగ్గర అసిస్టెంట్ గా చేరాడు.తర్వాత డైరెక్టర్ క్రాంతికుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన గుణశేఖర్ , క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దగ్గర పనిచేసాడు.

1992లో లాఠీ మూవీతో డైరెక్టర్ అయ్యాడు. నంది అవార్డు,బెస్ట్ ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నాడు. తరవాత సొగసు చూడ తరమా మూవీ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. దీనికి కూడా నంది పురస్కారం వచ్చింది.

1995లో బాల రామాయణం మూవీ జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా పురస్కారం అందుకుంది.

రాష్ట్రంలోనూ నంది అవార్డులొచ్చాయి. అంతర్జాతీయ బాల చలనచిత్రోత్సవంలో ప్రదర్శించారు.

తర్వాత మెగాస్టార్ చిరుతో చూడాలని ఉంది తీసిన గుణశేఖర్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.

డీటీఎస్ ఈ మూవీ ద్వారా పరిచయం చేసాడు. తర్వాత మనోహరం కూడా బాగానే ఆడినా, మృగరాజు దెబ్బతింది.

తర్వాత సూపర్ స్టార్ మహేష్ తీసిన ఒక్కడు మూవీ 2003లో ఇండస్ట్రీ హిట్ అయింది.

8నంది అవార్డులు,ఉత్తమ దర్శకుడు అవార్డుని అందుకుంది. వివిధ భాషల్లో డబ్ అయింది. తరవాత మహేష్ తీసిన అర్జున్ ఏవరేజ్ అయింది.

కానీ సైనికుడు మూవీ ప్లాప్ అయింది. తర్వాత బన్నీతో2010లో తీసిన వరుడు మూవీ డిజాస్టర్ అయింది.

తర్వాత రవితేజాతో నిప్పు కూడా డిజాస్టర్ గానే నిల్చింది. 2017లో వచ్చిన రుద్రమదేవి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.