మెగా మేనల్లుడు హిట్, ఫ్లాప్ రేటింగ్స్ ఇవే.!
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. అయితే తన కెరీర్ ఆరంభంలో మంచి హిట్ తోనే ప్రారంభించినా తర్వాత మాత్రం వరుస ప్లాప్ చిత్రాలతో పూర్తిగా తన గ్రాఫ్ పోగొట్టుకున్నాడు. అలా తాను అందుకున్న ప్లాప్ లలో “తిక్క” సినిమా మరింత ఘోరంగా వైఫల్యం చెందింది.
అలాగే అన్ని ప్లాప్ చిత్రాల తర్వాత భారీ హిట్ ఇచ్చిన చిత్రం “ప్రతీరోజూ పండగే”. వీటిలో తిక్క సినిమా మొట్ట మొదటిసారి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా లో టెలికాస్ట్ చెయ్యగా దానికి ఓ మాదిరిగా 4.14 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.
అలాగే ప్రతిరోజు పండగే సినిమాను కూడా స్టార్ మా లోనే మూడో సారి టెలికాస్ట్ చెయ్యగా 6.13 టీఆర్పీ రేటింగ్ సాధించింది. సో ఈ రెండు సినిమాల రేటింగ్స్ కు పెద్దగా తేడా లేదని చెప్పాలి. ఇప్పటికే ప్రతీరోజూ పండగే సినిమా అంత పెద్ద హిట్ ఎందుకు అయ్యిందో అని చాలా మంది అనుకున్నారు.