Movies

తమ్ముడికి పోటీగా మారిన అక్క…పోటీ తట్టుకోగలదా ?

మెగాస్టార్ చిరంజీవికి ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. ఇంచుమించు ఓ అల్లుడుతో సహా అందరూ సినీ ఫీల్డ్ లోనే ఉన్నారని చెప్పాలి. పెద్ద కూతురు సుస్మిత తన తండ్రి చిరంజీవి హీరోగా నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో పాటు సైరా నరసింహారెడ్డి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. ప్రస్తుతం ఈమె కొత్త కొత్త కథలతో వెబ్ సిరీస్‌లను తెరకెక్కించడానికీ రెడీ అవుతోంది. అంతేకాదు తన నిర్మించే నిర్మాణ సంస్థకు గోల్డ్ బాక్స్ ఎంటరైన్మెంట్ అనే పేరును కూడా ఖరారు చేసింది. అంతటితో సరిపెట్టకుండా ఈ సంస్థలో భవిష్యత్తులో తమ కుటుంబంలోని హీరోలతో సినిమాలను నిర్మించాలనే ప్లాన్‌లో ఉంది.

సుస్మిత నిర్మించే వెబ్ సిరీస్‌లు తన మేనమామ, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌కు సంబంధించిన ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేసేలా వెబ్ సిరీస్‌లు ప్లాన్ చేస్తోంది. అలాగే తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. నిజానికి చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగానే కాకుండా.. తమ ఇంటి పేరున కొణిెదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో చిరంజీవి హీరోగా ‘ఖైదీ నెంబర్ 150’, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలను నిర్మించాడు. ఇలా సొంతంగా సినిమాలు ప్లాన్ చేయడం చిరు ఫ్యామిలీలో మొదటి నుంచీ ఉన్నదే.

మెగా బ్రదర్ నాగబాబు.. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో పలు చిత్రాలను చిరంజీవి, పవన్, రామ్ చరణ్‌లతో నిర్మించాడు. రామ్ చరణ్ తో కూడా ఆరెంజ్ తీసాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన పేరున పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ‘సర్ధార్ గబ్బర్ సింగ్’తో పాటు ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించారు. అలాగే రామ్ చరణ్ కూడా సినిమాలు తీస్తుంటే, తాజాగా అతని సోదరి సుస్మితా కూడా నిర్మాణ రంగంలో దూకింది. నిజానికి సుస్మిత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఓల్డ్ స్టూడెంట్‌. ఇపుడు సుస్మిత తాను ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుకున్న చదువు తన తండ్రి నటించిన సినిమాలకు బాగానే తోడుగా ఉంటూ, తమ్ముడు చెర్రీ బాటలో నడుస్తోంది.