మాస్క్ లో ఉన్న ఈ హీరోని గుర్తు పట్టారా…అయితే త్వరగా చూడండి

సినీ పరిశ్రమలో స్వశక్తితో ఎదిగిన నటుడు రవితేజ. చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఎదిగాడు. అభిమానులతో మాస్ మహారాజ్ అని పిలిపించుకుంటూ తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కరోనా నేపథ్యంలో రవితేజ ఇంటిలో ఉంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నాడు.

ఇందులో భాగంగా ఇటీవలే తన ఇంటిలో పెంపుడు కుక్కలతో దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా రవితేజ షేర్ చేశాడు.అయితే ఈ ఫోటోలలో రవితేజ మాస్కు ధరించి కనిపించాడు. ఈ ఫోటోకి “మై బాయ్స్” అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఈ ఫోటో పెట్టిన చాలా తక్కువ సమయంలోనే చాలా LIKES వచ్చాయి.

అభిమానులు కూడా బాగా షేర్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రవితేజ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న క్రాక్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో రవితేజ కి జోడీగా శృతిహాసన్ నటిస్తుండగా, విలన్ పాత్రలో కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగాఉంది . కరోనా కారణంగానే వాయిదా పడింది.

error: Content is protected !!