Movies

శరత్ బాబు గురించి ఈ నమ్మలేని నిజాలు…ఆలస్యం లేకుండా చూసేయండి

తెలుగులోనే కాదు, తమిళ ,కన్నడ సినిమా రంగాల్లో 2వేలకు పైనే సినిమాలు చేసిన విలక్షణ నటుడు శరత్ బాబు. హీరోగా, విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయా పాత్రల్లో జీవించిన శరత్ బాబు అందగాడు కూడా. 1951జులై 31న ఏపీలోని ఆముదాల వలసలో జన్మించిన ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. 1973లో రామరాజ్యం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి, తరవాత కన్నడ మూవీలో చేసాడు.

సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో పంతులమ్మ , అమెరికా అమ్మాయి చిత్రాల్లో శరత్ బాబు నటించాడు. తర్వాత కె బాలచందర్ డైరెక్షన్ లో చిలకమ్మ చెప్పింది మూవీలో చేసాడు. 1981నుంచి 1983వరకూ మూడుసార్లు ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. సీతాకోక చిలుక,ఓ భార్య కథ, నీరాజనం మూవీస్ కి నంది అవార్డులు అనుకున్నారు.

సినిమా కెరీర్ లో ఉండగానే తనకన్నా నాలుగేళ్లు పెద్దదైన రమాప్రభను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. అయితే 14ఏళ్ల తర్వాత విడాకులతో దూరమయ్యారు. తానూ ఆశ్రయం కోసం పెళ్ళిచేసుకుంటే, అవసరం కోసం శరత్ బాబు పెళ్లిచేసుకున్నాడని 2007లో ఓ ఇంటర్యూలో రమా ప్రభ చెప్పింది. శరత్ బాబు సాఫ్ట్ క్యారెక్టర్స్ ,తండ్రి పాత్రలతో ఇప్పటికీ అలరిస్తున్నాడు. ఈమధ్య కాలంలో పెళ్లికూడా చేసుకుని హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు.