వి.వి.వినాయక్ సినిమాల్లోకి ఎందుకు వచ్చాడు…కెరీర్ ఇలా ఉండటానికి కారణం ఎవరు ?

ఆది,సాంబ,ఠాగూర్,దిల్ వంటి సూపర్ డూపర్ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు గ్రామంలో 1974అక్టోబర్ 9న బి కృష్ణారావు,నాగరత్నం దంపతులకు జన్మించాడు. వీర వెంకట వినాయక్ కి ఇద్దరు తమ్ముళ్లు,ముగ్గురు చెల్లెల్లు ఉన్నారు. వీళ్లకు వినాయక్ అనే థియేటర్ కూడా చాగల్లు గ్రామంలో ఉంది. చిరంజీవి అభిమానిగా ఉండే వినాయక్ కి చదువు పెద్దగా అబ్బలేదు. 1990లో ఎక్కువగా చూస్తూ,ఇక వాళ్ళ థియేటర్ లో చిరు మూవీ వస్తే, ఫ్రెండ్స్ అందరికీ టికెట్స్ ఇచ్చి సందడి కూడా చేసేవాడు. ఇంటర్ పోవడంతో చదువుకి స్వస్తి చెప్పేసి థియేటర్ పనులు చూసేవాడు. ఆసమయంలో ఎగ్జిబిటర్ గా నష్టాలు రావడంతో తండ్రి డిస్ట్రిబ్యూటర్ గా అవతారం ఎత్తారు. అయినా పాతిక లక్షలు అప్పులు అయిపోయాయి. దీంతో థియేటర్ మూసేసారు. ఏదైనా పనిచేసి,అప్పులు తీర్చాలని అనుకున్నాడు.

అదే జిల్లాకు చెందిన ఈవీవీ సత్యనారాయణ సినిమా డైరెక్టర్ గా హిట్ మీద హిట్ అందుకుంటుంటే అందరూ అయన గురించి మాట్లాడుకోవడం విన్న వినాయక్ తాను కూడా డైరెక్టర్ ఎందుకవ్వకూడదనే ఆలోచన వచ్చింది. సినిమాల్లోకి వెళ్ళడానికి తండ్రి ససేమిరా అనేయడంతో బలవంతంగానైనా వెళ్లిపోతానని,తల్లికి,ఊళ్ళో పెద్దలకు చెప్పేసాడు. అప్పులు తీర్చాలంటే వెళ్లాల్సిందేనని చెప్పుకొచ్చాడు. దీంతో తండ్రిని అందరూ ఒప్పించడంతో వినాయక్ 1994లో హైదరాబాద్ వచ్చేసాడు. ఆరునెలలు కష్టపడి మొత్తానికి ఈవీవీ దగ్గర, ముత్యాల సుబ్బయ్య దగ్గర చేరాలనుకుంటే అప్పటికే చాలామంది అసిస్టెంట్స్ తో వాళ్ళు బిజీగా ఉన్నారు. మొత్తానికి డైరెక్టర్ సాగర్ దగ్గర అప్రెంటీస్ గా చేరడం,ఆసమయంలో అమ్మ దొంగా మూవీ చేయడంతో వినాయక్ పనితనం సాగర్ కి నచ్చింది. 1997లో ఓసి నా మరదలా సినిమాకి కూడా సాగర్ దగ్గర అసిస్టెంట్ గా చేసాడు. సాగర్ దగ్గర చేస్తూనే ఈవీవీ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా చేసాడు. పాడుతా తీయగా సమయంలో వినాయక్ ని బెల్లంకొండ సురేష్ బాగా గమనించాడు. ఈలోగా కథలు రాసుకుని,డైరెక్టర్ అవ్వడం కోసం ఫ్రెండ్ నల్లమలుపు బుజ్జిని కలవడం ,వినాయక్ గురించి బెల్లంకొండకు చెప్పడంతో వినాయక్ గురించి తెల్సిన బెల్లంకొండ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి కథ ఉంటె చెప్పమన్నాడు.

అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ షూటింగ్ లో ఉన్న తారక్ ని ఎలాగోలా ఒప్పించి కథ వినేలా చేయడంతో కేవలం ఇంట్రో మాత్రమే చెప్పమని టైం ఇచ్చాడు. అయితే వినాయక్ కథ చెబుతుంటే తారక్ రెండు గంటలకు పైగా లీనమై,ఒకే చేసాడు. కానీ తారక్ వ్యవహారాలు చూసే కొడాలి నాని మాత్రం లవ్ స్టోరీ కాకుండా మాస్ స్టోరీ చేయాలనీ చెప్పడంతో అలాంటి కథ చెప్పమని అనడంతో వినాయక్ వారం సమయం అడిగి, 48గంటలు ఏకధాటిగా కథ తయారుచేసి తారక్ కి వినిపించాడు. నచ్చేసి, తారక్ డేట్స్ ఇచ్చేసాడు. అయితే బూరుగుపల్లి శివరామకృష్ణ ను నిర్మాతగా పెట్టుకోవాలని తారక్ అనడంతో బుజ్జి ని వదులుకోలేనని వినాయక్ చెప్పాడు. దాంతో బెల్లంకొండ సురేష్ నిర్మాత, బుజ్జి సహ నిర్మాత. హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్,సదా, త్రిష అనుకున్నా,చివరకు కీర్తి చావ్లాను సెలెక్ట్ చేసారు.

మొత్తానికి ఆదికేశవరెడ్డి మూవీ స్టార్ట్ చేసారు. అయితే ఫ్యాక్షన్ మూవీ అని తెలిసిపోతుందని తెల్సి 2002మార్చిలో ఆది పేరిట రిలీజ్ చేసారు. ఈ మూవీలో ఎన్టీఆర్ మాస్ హీరోగా అదరగొట్టాడు. వినాయక్ పేరు మారుమోగిపోయింది. 4కోట్లు బడ్జెట్ అయితే 12కోట్లు వసూలు చేసింది. వినాయక్ తండ్రికి ఆనందం. ఇక నైజాం డిస్ట్రిబ్యూషన్ చేసిన రాజు కూడా వినాయక్ కి ఫ్రెండ్ అయ్యారు. అయితే మరో సినిమా చేయాలనీ బెల్లంకొండ అడగడంతో బాలయ్యతో చెన్నకేశవరెడ్డి స్టార్ట్ చేసాడు. 2002సెప్టెంబర్ లో చెన్నకేశవరెడ్డి రిలీజ్ చేసారు. కానీ బ్లాక్ బస్టర్ కాలేదు. అయితే అంతకుముందు తారక్ కి చెప్పిన లవ్ స్టోరీ డవలప్ చేసి,నితిన్ హీరోగా దిల్ మూవీ చేసాడు. 2003ఏప్రియల్ లో విడుదలైన దిల్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో వినాయక్ పేరు రావడమే కాదు, అప్పటినుంచి రాజు దిల్ రాజు అయ్యాడు. రెండున్నరకోట్ల తో తీస్తే,11కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి పిలవడం, రమణ అనే తమిళ మూవీ చూపించడం, డైరెక్ట్ చేయమని అడగడంతో వినాయక్ ఆనందానికి హద్దుల్లేవు.

తాను అభిమానించే వ్యకిని డైరెక్ట్ చేయడం నిజంగా అదృష్టమే. అలా ఠాగూర్ మూవీ చేసాడు. 2013సెప్టెంబర్ రిలీజై బ్లాక్ బస్టర్ అయింది. అందులో ఎసిఎఫ్ స్టూడెంట్ గా కూడా వినాయక్ చేసాడు. 46కోట్లు వసూలు చేసింది. తరువాత తారక్ తో సాంబ, అదుర్స్,అల్లు అర్జున్ తో బన్నీ, బద్రీనాధ్, వెంకటేష్ తో లక్ష్మీ,ప్రభాస్ తో యోగి, రామ్ చరణ్ తో నాయక్ మూవీస్ చేసిన వినాయక్, బెల్లకొండ సురేష్ కొడుకు శ్రీనుతో అల్లుడు శ్రీను చేసాడు. కానీ అఖిల్ సినిమా ప్లాప్ అయింది. అప్పులు అయిపోవడంతో మళ్ళీ9ఏళ్ల తర్వాత రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరుతో ఖైదీ నెంబర్ 150చేసాడు. 2017లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది . సాయి ధర్మ తేజ్ తో ఇంటిలిజెంట్ తీసి దెబ్బతిన్నాడు. ఇక శీనయ్య అనే మూవీలో హీరోగా చేస్తున్నాడు. ఇక తారక్ తో దాన వీర సూర కర్ణ మూవీ తీయాలన్నది వినాయక్ కోరిక.