సమంత కెరీర్ లో ఎన్ని హిట్స్,ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో తెలుసా ?

అక్కినేని వారి కోడలు సమంత పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో తన జోష్ కొనసాగిస్తోంది. ఏం మాయ చేసావే మూవీతో టాలీవుడ్ లో, కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన సమంత రెండు చోట్లా హిట్ కొట్టింది. ఎన్నో హిట్ మూవీస్ లో నటించి తన సత్తా చాటుతోంది. రెండు బ్లాక్ బస్టర్స్,4 సూపర్ హిట్స్, 7హిట్స్ ఎబో ఏవరేజ్ 1, యావరేజ్ 3,ప్లాప్ లు 8 ఆమె కెరీర్ లో ఉన్నాయి. అందంతో పాటు మంచి వ్యక్తిత్వం కూడా ఉన్న నటి ఈమె. నాగచైతన్యతో పెళ్లి తర్వాత మరింత క్రేజీ హీరోయిన్ గా రాణిస్తోంది. 2010నుంచి ఈ పదేళ్ల కాలంలో తెలుగు,తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ విభిన్న తరహా చిత్రాలతో ఆడియన్స్ ని మెప్పిస్తోంది. 2010లో ఏం మాయ చేసావే తో హిట్ అందుకుని,అదే ఏడాది మరో తమిళ మూవీతో ప్లాప్ గా మిగిలింది. తర్వాత బృందావనం మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జోడీ కట్టి హిట్ అందుకుంది.

ఇక సమంత 2011లో చేసిన తమిళ మూవీ ప్లాప్ అవ్వగా, తెలుగులో దూకుడు భారీ హిట్ అయింది. 2012లో ఈగ మూవీతో భారీ హిట్ అందుకుంది. 2012లో 4సినిమాలు చేసింది. ఏటో వెళ్ళిపోయింది మనసు ఎబో ఏవరేజ్ గా నిలవగా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ సూపర్ హిట్ అయింది. 2013లో కూడా నాలుగు సినిమాలు చేసింది. జబర్దస్త్,,రామయ్య వస్తావయ్యా, ప్లాప్ గా నిలిసే, అత్తారింటికి దారేది,మనం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. 2014లో ఐదు సినిమాలు చేసింది. అల్లుడు శ్రీను, పంజా, రభస, కత్తి ప్లాప్. ఆటోనగర్ సూర్య ప్లాప్. అల్లుడు శ్రీను యావరేజ్. కత్తి మూవీ తమిళంలో హిట్ అయింది.

కాగా 2015లోసమంత మూడు సినిమాలు చేసింది . సన్నాఫ్ సత్యమూర్తి మంచి హిట్ తెచ్చింది. 2016లో ఏకంగా ఆరు సినిమాల్లోనాలుగు భారీ హిట్స్ కొట్టింది. తమిళంలో తేరి,24 అలాగే తెలుగులో అ ఆ ,జనతా గారేజ్ సూపర్ హిట్ అయ్యాయి. 2017లో చేసిన రెండు సినిమాల్లో మెర్సల్ బ్లాక్ బస్టర్ హిట్. రాజుగారి గది 2యావరేజ్. 2018లో తెలుగులో రంగస్థలం ఇండస్ట్రీ హిట్అందుకుంది. రెండు తమిళ మూవీస్ హిట్. ఇక యూ టర్న్ మంచి పేరు తెచ్చింది. ఓ బేబీతో మరోసారి టాలీవుడ్ లో బ్యూటిఫుల్ బేబీగా ఎంట్రీ ఇచ్చింది. 2019లో నాగచైతన్యతో మజిలీ చేసి, సూపర్ హిట్ ఇచ్చి, మంచి జోడీగా పెళ్లితర్వాత కూడా అన్పించుకుంది.