Movies

సమ్మర్ లో రావటానికి సిద్ధంగా ఎన్ని సినిమాలు ఉన్నాయో చూడండి

నిజానికి ప్రతియేటా సమ్మర్ వస్తే ఎన్నో సినిమాలు సందడి చేస్తాయి. కానీ ఈసారి కరోనా దెబ్బకు ఇండస్ట్రీ మొత్తం మూతపడిపోయింది. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా షూటింగ్స్ స్టార్ట్ అవుతున్నా, పూర్తిస్థాయిలో షూటింగ్స్ అప్పుడే ఉండేలా లేవు. అందుకే 2021నాటి వేసవికి సినిమాలను రిలీజ్ చేయాలని చాలామంది రెడీ అవుతున్నారు. ఎందుకంటే కరోనా కేసులు పెరుగుతుండడం,ఇండస్త్రీలో వాళ్ళకి కూడా కరోనా తాకడంతో చాలామంది ఇప్పట్లో షూటింగ్ అంటే వద్దు అనే మాట చెప్పేస్తున్నారు. 80శాతం షూటింగ్ పూర్తయిన సినిమాలు కూడా కంప్లిట్ కి నోచుకోవడం లేదు.

వాక్సిన్ వస్తే కానీ సెట్స్ మీదికి రావడానికి హీరోలు జంకుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ,క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య మూవీ మోషన్ పోస్టర్ లో కూడా రిలీజ్ సమ్మర్ లోనే అని చెప్పేసారు. అయితే కొంత ప్యాచ్ వర్క్,పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పూర్తవుతుంది. సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు. కానీ నవంబర్, డిసెంబర్ పూర్తయ్యాకే మిగిలిన భాగం షూటింగ్ అని అంటున్నారు. దీంతో ఇది కూడా సమ్మర్ కే రెడీ అవుతుంది.

సాహో సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న రాధేశ్యాం కూడా సమ్మర్ కి గానీ వచ్చేలా లేదు. షూటింగ్ వర్క్ చాలా బ్యాలెన్స్ ఉంది. ఇక విక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్ప కూడా ఇంకా పూర్తికాలేదు. డిసెంబర్ నాటికీ థియేటర్లు పూర్తిస్థాయిలో పనిచేస్తేనే సంక్రాంతికి విడుదల చేయాలనీ,లేకుంటే సమ్మర్ లోనేనని అని సురేష్ బాబు చెప్పేసారు. నాగచైతన్య లవ్ స్టోరీ,అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు కూడా షూటింగ్ పెండింగ్ లోనే ఉన్నాయి. ఇవన్నీ సమ్మర్ లోనే రానున్నాయని టాక్.