Movies

ఒకప్పటి ఈ రవి తేజ హీరోయిన్ గోపిక గుర్తుందా?? ఆమె పెళ్లి చేసుకున్న భర్త ఎవరో తెలుసా??

కొందరు హీరోయిన్స్ తక్కువ సినిమాలు చేసినా గుర్తుండిపోతారు. అలా మెరిసి ఇలా ఇండస్ట్రీ నుంచి దూరమై పోతారు. సడన్ గా ఫోటోలు కనిపిస్తే జనానికి ఈజీగా గుర్తొస్తుంది. అలాంటి హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ ఫోటోలు అందునా ముద్దుల కూతురు ,భర్తతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన గోపిక ఎన్నో సినిమాల్లో చేసింది. ఈ మలయాళీ భామ కేరళలో పుట్టి పెరిగింది. ఇక ఇప్పుడు షేర్ చేసిన ఈ ఫోటోలు బాగా అలరిస్తున్నాయి.

డిగ్రీ చదివే రోజుల్లోనే హీరోయిన్ గా ఛాన్స్ వెతుక్కుంటూ రావడంతో గోపిక మలయాళ వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. జయసూర్య, వినీత్ వంటి స్టార్ హీరోలతో కల్సి నటించిన ఆ సినిమా హిట్ కాలేదు. కానీ కొత్త హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత ఫర్ ద పీపుల్ మూవీలో చేసి,బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇది తెలుగులో డబ్ అవ్వడంతో మల్లీశ్వరివే సాంగ్ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది. ఇక మాస్ మహారాజ్ రవితేజ సరసన నా ఆటోగ్రాఫ్ మూవీతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చింది. ఈమూవీలో ఆమె నటనకు జనం నీరాజనం పట్టారు.

లేతమనసులు,ముద్దుల కొడుకు,వీడు మామూలోడు కాదోయ్ వంటి సినిమాల్లో చేసిన గోపిక మంచి పేరు తెచ్చుకుంది. తమిళం,మలయాళం,కన్నడ భాషల్లో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటనకు అద్దంపట్టే సినిమాల్లోనే చేసింది. కెరీర్ బిజీగా ఉండగానే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అజిలేష్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి,ఆస్ట్రేలియాలో భర్త,ఇద్దరు పిల్లలతో హాయిగా గడుపుతోంది. పదేళ్ల క్రితం వెండితెరకు దూరమైన ఈమె ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో ఎలా ఉందొ తెలియజేస్తూ ఫోటోలు షేర్ చేయడంతో ఫాన్స్ ఫిదా అవుతున్నారు. మంచి పాత్రలు వస్తే సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించడానికి ఈమె సిద్ధంగా ఉందన్న మాట విన్పిస్తోంది.