సుధీర్ బాబుకి ‘V” సినిమా ప్లస్ అవుతుందా…మైనస్ అవుతుందా ?
“V” సినిమాలో నాని,సుధీర్ బాబు కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా నానికి 25 వ సినిమా. నాని సినిమా అంటే డామినేషన్ చాలా ఎక్కువగా కనపడుతుంది. అయితే ఈ సారి ‘V” సినిమాలో సుధీర్ బాబుతో గట్టి పోటీ ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో నాని సైకో గా నటిస్తే , సైకో ఆటలు కట్టిపడేసే పోలీస్ అధికారిగా సుధీర్ బాబు కనిపించనున్నాడు.
నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన డైలాగ్ డెలివరీతో, నటనతో… మెస్మరైజ్ చేస్తాడు. అయితే `వి`లో సుధీర్ బాబు పాత్ర కూడా అందుకు ధీటుగా ఉంటుందని తెలుస్తోంది. ట్రైలర్లో తన ఎయిట్ ప్యాక్ బాడీతో షాక్ ఇచ్చాడు సుధీర్ బాబు. తనపై తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు మాస్‌ని అలరిస్తాయని చిత్రబృందం చెబుతోంది. సుధీర్ బాబుకి ఈ సినిమా సరికొత్త ఇమేజ్ ని తీసుకొస్తుందని అంటున్నారు.