Movies

కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్న సీనియర్ హీరోయిన్స్ …హవా మాములుగా లేదుగా

సినీ ఇండస్ట్రీలో వయసు పెరుగుతున్న కొద్దీ హీరోయిన్స్ కి ఛాన్స్ లు తగ్గిపోతుంటాయి. దాంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవడమో… క్యారక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఉండిపోవడంతో చేస్తుంటారు. అయితే త్రిష , నయతార , తమన్నా, కాజల్ అగర్వాల్ … ఈ నలుగురు సీనియర్ స్టార్ హీరోయిన్స్ మాత్రం వరుస సినిమా ఆఫర్స్ దక్కించుకుంటూ నేటితరం హీరోయిన్లకి పోటీ ఇస్తున్నారు. అయితే ఈ స్టార్ హీరోయిన్స్ జాబితా నుంచి అనుష్క – హన్సిక ఇప్పుడు సైడ్ అయిపోయారు. ఒకటీ అర సినిమాలు తప్ప పెద్దగా సినిమాలు కమిట్ అవడం లేదు. మరో సీనియర్ హీరోయిన్ ఛార్మీ నిర్మాతగా బిజీ గా ఉంది.

నయనతార మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ తరగని అందంతో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ బిజీ గా ఉంటోంది. సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తూ ఉంది. ‘నేత్రికాన్’ ‘మూకుతి అమ్మన్’ ‘కాతువాకుల రెండు కాదల్’ చిత్రాలతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘అన్నాత్తే’ సినిమాలోనూ నటిస్తోంది. ప్రస్తుతం నయన్ లైనప్ చూస్తుంటే ఆమె డేట్స్ దొరకాలంటే రెండేళ్లు ఆగాలి. ఇక త్రిష ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు అయినా సరే, కొత్త హీరోయిన్స్ కి పోటీగా అవాకాశాలు అందిపుచ్చుకుంటూ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్.. అనే మూవీలో నటిస్తోంది. అలాగే ఆమె నటించిన ‘పారపాధమ్ విలయట్టు’ ‘గర్జనాని’ ‘రాంగీ’ ‘షుగర్’ ‘రామ్’ లాంటి చిత్రాలు విడుదలకు రెడీ గా ఉన్నాయి.

కాజల్ అగర్వాల్ కెరీర్ స్టార్ట్ చేసి పన్నెండేళ్ళు అవుతున్నా ఇప్పటికీ జోరు తగ్గలేదు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాతో పాటు మంచు విష్ణు ‘మోసగాళ్లు’ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇక తమిళంలో కమల్ హాసన్ – శంకర్ కాంబోలో వస్తున్న ‘ఇండియన్ 2’ , ‘హే సినామికా’ మూవీస్ లో నటిస్తోంది. అలాగే హిందీలో ‘ముంబయి సాగా’ సినిమాలో చేస్తోంది. ‘లైవ్ టెలికాస్ట్’ అనే తమిళ్ వెబ్ సిరీస్ లో నటిస్తూ ఓటీటీ లో కూడా సత్తా చాటబోతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ అయింది. కెరీర్ లో ఒక్క ఏడాది కూడా ఈ భామ ఖాళీగా లేదు. ప్రస్తుతం ‘సీటీమార్’ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లవ్ మాక్ టైల్’ తెలుగులో రీమేక్ ‘గుర్తుందా శీతాకాలం’లో నటిస్తోంది అయితే కేవలం హీరోయిన్ రోల్స్ నే కాకుండా విలన్ కూడా రెడీ అవుతోంది. అందుకే ఈ బ్యూటీఫుల్ లేడీ విలన్ కి కథలు కూడా రెడీ చేస్తున్నారట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."