Movies

మగధీర సినిమా వెనక నమ్మలేని కొన్ని నిజాలు…అసలు నమ్మలేరు

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తూ తీసిన చిరుత మూవీ బాగా క్లిక్ అయింది. పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ మూవీ తో ఫాన్స్ ఖుషీ అయ్యారు. అయితే అంతకుముందు మొదటి సినిమా కాదు తర్వాత సినిమాకి ఓకే అని చెప్పినరాజమౌళి సరిగ్గా ఇప్పుడు ఎంటర్ అయ్యాడు. గతంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా జగదేక వీరుడు మూవీని తీయడానికి విజయేంద్ర ప్రసాద్ రాసిన కథ జక్కన్న మదిలో మెదిలింది. ఆ సినిమా చేయకపోవడంతో ఆ కథ అలానే ఉంది. చిరంజీవి,అల్లు అరవింద్,రామ్ చరణ్ లతో కల్సి రాజమౌళి కథ చెబుతున్నాడు. వందమంది యోధుల్ని వీరోచితంగా ఒక్క వీరుడు అంతం చేయడమే అంశంగా చెబుతున్న ఈ కథ వింటుంటే ,కళ్ళకు కట్టినట్లు ఉంది. అందుకే చిరంజీవి అదిరిపోయాడు. చిరు తనకు చాలా హిట్స్ ఇచ్చారని,ఆయనకు కానుకగా తన మేనల్లుడి సినిమా ఉండాలని ఎంత ఖర్చైనా పర్లేదని ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న అరవింద్ చెప్పాడు.

దీంతో జక్కన్న ఫ్యామిలీ మొత్తం కూర్చుండగా 15ఏళ్ళ క్రితం నాటి కథ ఇంకా గుర్తుందా అని విజయేంద్ర ప్రసాద్ అడగడంతో అవునని, రామ్ చరణ్ హార్స్ రైడింగ్ కూడా తెలిసిన వాడు కనుక ఈ సినిమా చేయాలనీ జక్కన్న చెప్పాడు. ఘరానామొగుడు మూవీలోని బంగారు కోడి పెట్ట సాంగ్ ని రీమిక్స్ చేద్దామని వదిన వల్లీ చెప్పడంతో రాజమౌళి ఒకే అనేశాడు. కొంత జానపదం,కొంత సాంఘికం తో కూడిన ఈ మూవీ లో మొదట రాజమాత అనుకున్న పాత్ర రాజకుమారిగా మార్చారు. హీరో హీరోయిన్స్ పర్వతాల నుంచి పడి చనిపోవడమే మొదటి సీన్ గా తీయాలని ప్లాన్. రాజకుమారి మిత్రవింద పాత్ర కోసం కాజల్ ఒకే. స్క్రిప్ట్ దశలోనే షేర్ ఖాన్ పాత్రకు శ్రీహరిని అనుకున్నారు. విలన్ గా దేవ్ గిల్. ఇతడికి హార్స్ రైడింగ్ అంటే భయం.

అందుకే రేయింబవళ్లు ప్రాక్టీస్ చేసి,ఈ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. కెమెరా సెంథిల్, ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర రెడ్డి,ఫైట్ మాస్టర్ పీటర్ హింట్ , బి ఎఫ్ ఎక్స్డ్ కమల్ హండే, స్టైలింగ్ రమా రాజమౌళి. ఇక మ్యూజిక్ కీరవాణి.కొంత రియల్,కొంత గ్రాఫిక్స్. ఉదయ్ కోట సగం వేయడానికి మూడు నెలల సమయం. గ్రద్ద షేప్ లో ఇచ్చిన డిజైన్ అదిరింది. మిగిలిన భాగం గ్రాఫిక్స్ వాళ్లకి అప్పగించాడు. ఎక్కడా రాజీ పడకుండా ఫైట్స్ కంపోజ్. బైక్ ఛేంజింగ్ లో 90అడుగులు పైకిలేచి కింద పడిపోవడంతో ఫైట్ మాస్టర్ ని కిమ్స్ లో చేర్చారు. నాలుగు నెలలు బెడ్ రెస్ట్ అన్నారు. కానీ మొండివాడు కావడంతో నెలకే తిరిగొచ్చి అదే షాట్ మళ్ళీ తీసాడు.

కాలభైరవ పాత్ర కోసం కొత్త లుక్ తో యోధుడిలా తయారయ్యాడు. రాజస్థాన్ ఎడారిలో తగిలిన గుర్రం చాలా స్పీడ్. అదేకావాలన్నాడు చరణ్. రైడింగ్ లో చరణ్ కి గాయం కావడంతో రెండు నెలలు బెడ్ రెస్ట్. షూటింగ్ ఒక ఎత్తు అయితే,గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరో ఎత్తు. అంతెందుకు రిలీజ్ కి రెండు రోజుల ముందు మళ్ళీ కొన్ని సీన్స్ చేయించుకున్నాడు. ఇక రిలీజ్ ముందు రోజు రాత్రి ప్రివ్యూ వేస్తె,తుపాన్ ముందు ప్రశాంతత ఎలా ఉఁటుందో ఆలా ఉంది.

వరల్డ్ వైడ్ 1200థియేటర్లలో రిలీజైన ఈ మూవీ 223సెంటర్స్ లో వందరోజులు పూర్తి. 39కోట్ల బడ్జెట్ కి 125కోట్లు గ్రాస్. వంద కోట్లు కలెక్ట్ చేసిన తొలితెలుగు మూవీగా మగధీర నిల్చింది. కర్నూల్ లో ఒకే థియేటర్ లో వెయ్యి రోజులు ఆడి, రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళంలో డబ్బింగ్ అయి అత్యధిక వసూళ్లు రాబట్టిన ఈమూవీ కర్ణాటకలో కూడా ఎక్కువ కలెక్షన్ తెచ్చింది. ఓవర్సీస్ లో 7న్నర కోట్లు వసూలు చేసింది. 9నంది అవార్డులు రెండు నేషనల్ అవార్డులు,7ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి. చెర్రీ,జక్కన్న ఆరేసి కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారు.