Movies

ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా….ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?

మారుతి డైరెక్షన్ లో వచ్చిన ఈరోజుల్లో మూవీ లో ఒక సాంగ్ లో కన్పించిన ఆనంది తెలంగాణా అమ్మాయే. బస్టాప్ మూవీలో సీమ పాత్రతో ఆకట్టుకుంది. ఇక వరుణ సందేశ్ హీరోగా వచ్చిన ప్రియతమా నీ మనస్సు కుశలమా అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. తెలుగులో అంతగా ఛాన్సులు రాలేకపోవడంతో తమిళ ఇండస్ట్రీలో లుక్ వేసి మంచి ఛాన్స్ లు కొట్టేసింది. అంతేకాదు టాప్ హీరోయిన్ గా తమిళంలో మారిపోయింది.

ఇక తమిళంలో జివి ప్రకాష్ సరసన చాలా సినిమాల్లో చేసింది. రక్షిత అనే పేరు గల ఆనంది ఎన్నో అద్భుత అవకాశాలతో దూసుకెళ్తోంది. అవార్డులు,రివార్డులు కూడా దక్కించుకున్న ఆనంది 2011లో తమిళంలోకి ఎంటర్ అవ్వడం, తొలిసినిమా భారీ హిట్ కావడం బాగా కల్సి వచ్చాయి.

చండీవీర్ అనే మూవీలో అద్భుత కేరక్టర్ వేసిన ఆనంది 2015లో జివి ప్రకాష్ సరసన నటించి మంచి పేరు కొట్టేసింది. ఏడాదిలో నాలుగు సినిమాలకు తక్కువ కాకుండా తమిళంలో చేస్తున్న ఈ అమ్మడు తెలుగులో మళ్ళీ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలని అందరూ అంటున్నారు.