Beauty TipsHealth

కొత్తిమీరలో ఇది కలిపి రాస్తే నల్లని మచ్చలు తొలగిపోయి ముఖం మిలమిలా మెరిసిపోతుంది

Coriander Leaf Beauty Benefits : కొత్తిమీరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో Beauty ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రకరకాల పచ్చళ్ళు నాన్ వెజ్ వంటలు మసాలా వంటలలో కొత్తిమీర కచ్చితంగా ఉండాల్సిందే. కొత్తిమీరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అయితే కొత్తిమీరలో బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. నల్లని మచ్చలు త్వరగా తగ్గాలంటే కొత్తిమీర రసం బాగా హెల్ప్ అవుతుంది.

ఒక స్పూన్ కొత్తిమీర రసంలో అరస్పూను నిమ్మరసం కలిపి మొఖానికి పట్టించి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావుగంటయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా నాలుగు నుంచి ఐదు రోజులు చేస్తే మంచి ఫలితం వస్తుంది. ముఖం మీద నల్లని మచ్చలు అన్నీ తొలగిపోతాయి.
Face Beauty Tips In telugu
మొటిమల సమస్య వేధిస్తుంటే ఈ చిట్కా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒక స్పూన్ కొత్తిమీర రసంలో ఒక స్పూన్ టమాటా రసం కలిపి ముఖానికి రాసి అరగంటయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. టమోటాలో ఉన్న లక్షణాలు ముఖం తెల్లగా మెరవటానికి సహాయపడుతుంది.

కొత్తిమీర రసంలో కొద్దిగా కలబంద జెల్ కలిపి ముఖానికి రాసి శుభ్రం చేసుకుంటే ముఖం పొడి బారకుండా తేమగా ఉంటుంది. అలాగే ముడతలు రాకుండా చేస్తుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. కలబంద జెల్ మార్కెట్ లో దొరుకుతుంది. లేదంటే ఇంటిలో కలబంద ఉంటే తాజా జెల్ ఉపయోగించవచ్చు.
Wrinkles remove Tips In Telugu
కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ముడతలు, వృధ్యాప్య ఛాయలను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన చర్మంపై మచ్చలు లేకుండా చేస్తుంది. చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి చర్మ సమస్యలను తగ్గించుకోవటానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.