Healthhealth tips in telugu

డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగితే ఏమి అవుతుందో తెలుసా ?

Coconut Water in Diabetes: ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ వచ్చేస్తుంది. డయాబెటిస్ ఉన్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ వచ్చినప్పుడు జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ డయాబెటిస్ నియంత్రణలో ఉండే ఆహారం తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది.
Coconut water Benefits
డయాబెటిస్ ఉన్నప్పుడు తీపి పదార్ధాలకు , చక్కెర పానీయాలకు దూరంగా ఉండమని వైద్య నిపుణులు చెబుతుంటారు. దాంతో చాలా మంది వాటికి దూరంగా ఉంటారు. అలాగే పండు తినాలన్నా కాస్త ఆలోచిస్తూ ఉంటారు. మనలో చాలా మందికి డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగొచ్చా లేదా అనే సందేహం ఉంటుంది.
Diabetes diet in telugu
కొబ్బరి నీరు సహజసిద్దమైన పానీయం. దీనిలో ఎలక్ట్రోలైట్, పొటాషియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ సి, ఫోలేట్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. కొబ్బరి నీరు తియ్యగా ఉన్నా సరే దానిలో సహజ చక్కెర ఉంటుంది. కృత్రిమ స్వీటెనర్ ఉండదు. కాబట్టి ఇది మీ శరీరంలోని చక్కెర స్థాయిని ప్రభావితం ఎక్కువగా చేయదు.
coconut water benefits In telugu
కొబ్బరి నీటిలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి ఉండుట వలన ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే మోతాదుకి మించి తీసుకోకూడదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటిక్ పేషెంట్లు రోజూ 1 కప్పు (240 మి.లీ) కొబ్బరి నీళ్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.