Kitchen

ఎగ్ తో సింపుల్ గా అట్టు వేసుకుందామా

కావలసిన పదార్ధాలు
కోడిగుడ్డు 4
పచ్చి మిరపకాయలు 2 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి )
పెద్ద ఉల్లిపాయలు 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి )
కారం 1 టీస్పూన్
పసుపు 1/2 టీస్పూన్
ఉప్పు తగినంత
నూనె 4 టేబుల్ స్పూన్

తయారి విధానం
గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నీళ్లు తీసుకొని, ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. ఆ తర్వాత కోడిగుడ్లు పగలకొట్టి గిన్నెలోవేసి బాగా కలపండి.సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి. దోశల పెనం వేడిచేసి కొద్దిగా నూనె వేసుకోవాలి.దీనికి గిలకొట్టిన కోడిగుడ్డు మిశ్రమాన్ని కలిపి, పెనంని గుండ్రంగా అటుఇటు కదిలించాలి. దీనివల్ల పెనంలో సమానంగా గుడ్డు మిశ్రమం పరుచుకుంటుంది. కోడిగుడ్డు అంచుల మీద నూనెని వేయాలి. అట్టును రెండు వైపులా వేగించాలి. బాగా వేగాక పెనం మీదనుంచి దించి వేడివేడిగా సర్వ్ చేయటమే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."