అందానికి కార్న్ ఆయిల్(మొక్కజొన్న నూనె) ఎలా ఉపయోగించాలి ?
చాలా మందికి ఇది సుపరిచతమే. కానీ వంటలలో దీన్ని ఉపయోగించేవారు మాత్రం చాలా తక్కువ. కార్న్ ఆయిల్ ను వంటలలోనే కాక సౌందర్య సాధనాల తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. కొన్ని దేశాలలో పవర్ జనరేటర్స్ లో బొగ్గుకు బదులు ఈ నూనెను వాడతారు. ఇలా రకరకాలుగా వాడుతున్న కార్న్ ఆయిల్ గురించి తెలుసుకుందాము.
దీనిని వంటలలో వాడటం వలన బోలెడు ఆరోగ్య లాభాలను సొంతం చేసుకోవచ్చు. ఈ నూనేలోని పాలి అన్ సాత్యురేటెడ్ ,మోనో అన్ సాత్యురేటెడ్,ప్యాటి ఆసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచటంతో పాటు గుండె జబ్బులను దూరంగా ఉంచుతాయి. ఇవి కొలస్ట్రాల్ పెరగకుండా నిరోదిస్తాయి. చాలా మంది ఆలివ్ ఆయిల్ కి బదులుగా కార్న్ ఆయిల్ ను ఉపయోగిస్తున్నారు. అయితే దీన్ని ఎంత మోతాదులో వాడాలో నిపుణుల సలహా మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.
సౌందర్య సాధనాలైన క్రీం,లోషన్ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ నూనె మంచి మాయిశ్చరైజర్ గా ఉపయోగపడటమే కాకుండా చర్మ సహజ సౌందర్యాన్ని పరిరక్షిస్తుంది. లిప్ బామ్ కన్నా ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ నునెను వేడిచేసి చల్లారిన తర్వాత తర్వాత జుట్టుకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయటం వలన జుట్టు మెరుస్తూ ఉంటుంది. ప్రసవం తర్వాత వచ్చే స్ట్రెచ్ మార్క్స్ నిర్మూలనలో కూడా కార్న్ ఆయిల్ బాగా పనిచేస్తుంది.
సూచన
కొందరికి మొక్కజోన్నలంటే అలర్జీ ఉంటుంది. అలాంటి వారు ఈ నూనెను ఉపయోగించకుండా ఉంటేనే మంచిది. అలాగే ఈ నూనెను గట్టి మూత ఉన్న సీసా లేదా డబ్బాలో గాలి తగలని ప్రాంతంలో ఉంచాలి.