Movies

ఈ స్టార్ డైరెక్టర్స్ కి లక్కీ యాక్టర్స్ ఎవరో తెలుసా?

ఏ రంగంలో అయినా సెంటిమెంట్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగానికి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న విషయం కూడా సెంటిమెంట్ తో ముడిపడి ఉంటుంది. చాలామంది డైరెక్టర్స్ ఒక సినిమా హిట్ అయిందంటే ఆ సెంటిమెంట్ ఫాలో అవుతారు. ఇది పెద్ద డైరెక్టర్లు కూడా వర్తిస్తుంది

రాజమౌళి ప్రతి సినిమాలోనూ చంద్రశేఖర్ అనే యాక్టర్ తప్పనిసరిగా కనబడతాడు. చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా తప్పనిసరిగా ఉండాల్సిందే.

హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలోనూ రావు రమేష్ ఉంటాడు. ఒక్క షాక్ సినిమాల్లో మాత్రమే లేడు.

పూరి జగన్నాథ్ తీసే ప్రతి సినిమాలోనూ సుబ్బరాజు కచ్చితంగా ఉంటాడు. సుబ్బరాజు కెరీర్ మొదట్లో మంచి గుర్తింపు రావటానికి పూరి ఇచ్చిన పాత్రనే కారణం. పూరి డైరెక్ట్ చేసిన ఎనిమిది సినిమాల్లోనూ సుబ్బరాజు వివిధ పాత్రల్లో మనల్ని అలరించారు.

రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో తనికెళ్ల భరణి, కృష్ణవంశీ సినిమాల్లో బ్రహ్మాజీ, త్రివిక్రమ్ సినిమాలో అమిత్, శ్రీకాంత్ అడ్డాల సినిమాల్లో రావు రమేష్ లు ఎక్కువగా కనిపిస్తారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."