గాయాలను తొందరగా మాన్పే ఆహారం గురించి మీకు తెలుసా ?
ప్రమాదంలో గాయం అయినప్పుడు,శరీరంలో పుండ్లు అయినప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రది స్తాము. వారు సూచించిన మందులను క్రమం తప్పకుండా వేసుకుంటాము. అంతటితో అవి మానిపోతాయని అనుకుంటాము. కానీ మందులు వేసుకున్నంత మాత్రానా గాయాలు,పుండ్లు త్వరగా మానవు. వాటితో పాటు కొన్ని రకాల ఆహారపదార్దాలను తీసుకుంటేనే అవి త్వరగా నయం అవుతాయి. కొన్ని ఆహారపదార్దాలకి గాయాలను, పుండ్లను నయం చేసే శక్తి ఉంటుంది. అలా గాయాలను తొందరగా మాన్పే ఆహారపదార్దల గురించి తెలుసుకుందాము.
పసుపును నేరుగా లేదా ఆహార పదార్దాల తయారీలో వాడటం ద్వారా గాయాలను త్వరగా నయం చేసుకోవచ్చు. దీనిలోని యాంటి ఆక్సిడెంట్స్ గాయాలను త్వరగా మానటానికి దోహదం చేస్తాయి. గాయాలకు పసుపు వాడటం అనేది ఎప్పటి నుంచో వస్తున్నా అలవాటే.
స్వీట్ పొటాటో లో విటమిన్ ఎ,బి,సి,యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటి ఆక్సిడెంట్స్ గాయాలను త్వరగా మానటానికి సహకరిస్తాయి.
తేనెలోని సహజసిద్దమైన తీపిని చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ ఇష్టపడతారు. దీనిలో విటమిన్స్,అమినో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని నేరుగా గాయాలు లేదా పుండ్ల మీద అప్లై చేయటం వలన తొందరగా తగ్గుతాయి.
గాయం అయినప్పుడు పాలధారిత ఉత్పత్తులు అయిన మజ్జిగ,పెరుగు తినకూడదని అందరూ భావిస్తారు. కానీ అది వాస్తవం కాదు. పెరుగు,మజ్జిగ హాని చేస్తాయని శాస్త్రీయంగా రుజువు కాలేదు. శరీర ఆరోగ్యానికి పెరుగు లేదా మజ్జిగ దోహదం చేస్తాయి. అలాగే మంసంలో ఉన్న ప్రోటిన్స్,జింక్ గాయాలు త్వరగా నయం కావటానికి దోహదం చేస్తాయి.