Kitchen

బంజారాటిక్కిలు

కావలసిన పదార్దాలు

పాలకూర – 1 కట్ట
బంగాళా దుంపలు – 400 గ్రామ్స్
పన్నీర్ – 100 గ్రామ్స్
సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు – 10 గ్రామ్స్
వేయించిన శనగపిండి – 50 గ్రామ్స్
మొక్కజొన్న పిండి – 20 గ్రామ్స్
కారం పొడి – 10 గ్రామ్స్
జీడిపప్పు ముక్కలు – 20 గ్రామ్స్
సన్నగా తరిగిన అల్లం – 10 గ్రామ్స్
బ్రెడ్ క్రంబ్స్ – 50 గ్రామ్స్
వేయించటానికి సరిపడా నూనె
ఉప్పు – తగినంత

తయారుచేసే విధానం

ముందుగా బంగాళా దుంపలను శుభ్రంగా కడిగి చెక్కు తీసి తురమాలి. అలాగే పన్నీర్ ను కూడా తురమాలి. పాలకూర ను పేస్ట్ చేయాలి. ఒక బౌల్ తీసుకోని అందులో తురిమిన బంగాళా దుంప, పాలకూర పేస్ట్, తురిమిన పన్నీర్, పచ్చిమిరప ముక్కలు,వేయించిన శనగపిండి,మొక్కజొన్న పిండి,కారం పొడి,జీడిపప్పు ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి వడల్లాగా వత్తి బ్రెడ్ క్రంబ్స్ లో దొర్లించి నూనెలో గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. ఈ నోరురుంచే బంజారాటిక్కి కి పుదినా చెట్ని మంచి కాంబినేషన్.