“పవన్ కళ్యాణ్ “ని POWER STAR చేసిన క్వాలిటీస్
మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఎంట్రీ ఇచ్చినా, టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి హిట్,ప్లాప్ లతో సంబంధం లేకుండా పిచ్చిగా అభిమానించే ఫాన్స్ ఉన్నారు. అలాగని ఎక్కువ సినిమాలు చేసింది లేదు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ రేంజ్ కి వెళ్ళాడు. డైరెక్ట్ చిత్రాలతో పాటు రిమేక్ మూవీస్ కూడా పవన్ కి బాగా సూటయ్యాయి. అతడి స్టైల్ రేంజ్ కి తగ్గట్టే కథలు ఉంటున్నాయి. మొదట్లో పవన్ కి ఇంట్రో సాంగ్స్ అదిరిపోయేవి. ‘మేడ్ ఇన్ ఆంధ్రా’ సాంగ్ అప్పట్లో యూత్ కి ఎలా కనెక్ట్ అయిందో మాటల్లో చెప్పలేనిది. ఇప్పటికీ ఈ సాంగ్ కి క్రేజ్ ఉంది. రానురాను ఇంట్రో సాంగ్స్ నుంచి అర్ధవంతమైన మోటివేషన్ సాంగ్స్ కి మారాడని విశ్లేషకుల మాట.
బద్రి లో తెలుగు,హిందీ,ఇంగ్లీషు అన్నీ మిక్స్ చేసిన, ‘ఐ యాం ఇండియన్’ సాంగ్ ఇలాంటిదే. రమణ గోగుల ఇచ్చిన సాంగ్స్ అలాంటివి మరి. ఇక ఖుషీ మూవీలో హిందీతో స్టార్ట్ అయ్యేలా ఏ మేరా సాంగ్ విషయానికి వస్తే,అప్పట్లో సంచలనం. మణిశర్మ ట్యూన్స్ అంతలా పవన్ ట్రెండ్ కి తగ్గట్టు ఇచ్చారు. స్టెప్స్,మెసేజ్ అన్నీ వెరసి ఈ మూవీ సూపర్ హిట్. జానీ మూవీలో నారాజు సాంగ్,ఇక గుడుంబా శంకర్ లో లే లే సాంగ్ , కొమరం పులిలో మారాలంటే లోకం సాంగ్ అదిరిపోతాయి. ఇక గ్రౌండ్ లెవెల్ కేరక్టర్స్ ఎంచుకుని తన ఇమేజ్ ని పవన్ బాగా బిల్డప్ చేసుకున్నాడు. తొలిప్రేమ మూవీలో అన్ని హంగులు ఉంటాయి. రోజూ మనకల్లెదుట జరిగే పాత్రలే ఇందులో కన్పిస్తాయి.
తమ్ముడు,ఖుషీ ఇలా ఏ సినిమా తీసుకున్న క్యారెక్టర్స్ అన్నీ మనకి దగ్గరగా అనిపించేలా ఉంటాయి. ఇక ఆయా సినిమాల్లో వాడిన షాట్ గన్స్, పిస్టల్స్ నుంచి అన్ని రకాల గన్స్ కనిపిస్తాయి. ఇక బైక్ లు కూడా అలాగే సినిమా సినిమా కి వెరైటీగా ఉంటాయి. ఆలాగే కార్లు కూడా వెరైటీగానే ఉంటాయి. ఖుషి ఎంట్రీ ఫైట్ నుంచి అన్ని సినిమాల్లో ఫైట్స్ కంపోజ్ కూడా థ్రిల్ గా ఉంటాయి. అంతెందుకు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో రాళ్లు బద్దలు కొట్టడం,చేతులపై కారు పోనిచ్చుకోవడం ఇలా ఎన్నో సొంతంగా చేసినవే. అంతేనా తమ్ముడు,జానీ ,ఖుషీ, అత్తారింటికి దారేది,అజ్ఞాతవాసి వంటి మూవీస్ లో సింగర్ గా కూడా తన సత్తా చాటాడు. ఇక బిగినింగ్ లో కొత్త డైరెక్టర్స్ తో చేసాడు. కరుణాకరన్, విష్ణువర్ధన్,ఎస్ జె సూర్య,పూరి జగన్నాధ్ ఇలా అందరూ కొత్తవాళ్లే. త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి డైరెక్టర్ తో మూడు సినిమాలు చేసినా అవి కూడా ఈమధ్యనే. ముఖ్యంగా జానపదం పాటలంటే పవన్ కి చాలా ఇష్టం.