Movies

హిట్ కోసం పరితపిస్తున్న స్టార్ డైరెక్టర్స్ …వీరి పరిస్థితి ఏమిటో ?

సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా దాని ప్రభావం మీదే పడుతుంది. అందుకే స్టార్ హీరోల తర్వాత అంతటి క్రేజ్ డైరెక్టర్స్ కి ఉంటుంది. ఎవరి క్రియేటివిటీ వాళ్ళు చూపిస్తారు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క బాణీ. అయితే ప్రస్తుతం హిట్స్ లేక సతమతమవుతున్న స్టార్ డైరెక్టర్లు కూడా ఉన్నారు. కామెడీ డైలాగులతో పట్టుతప్పని స్క్రీన్ ప్లే తో శ్రీను వైట్ల మొదటి నుంచీ హిట్ హిట్ మీద హిట్ కొడుతూ వచ్చాడు. కామెడీ ఫార్ములాతో సొంతం,ఢీ, దుబాయ్ శ్రీను,దూకుడు,కింగ్ ఇలా అన్నీ చూస్తే మర్చిపోలేని ఎన్నో పాత్రలను క్రియేట్ చేసి తెరమీద ఆవిష్కరించాడు. అయితే ఆయన కామెడీ ఫార్ములా సడన్ గా దెబ్బతింది. దాంతో 7ఏళ్లుగా హిట్ లేదు. అమర్ అక్బర్ అంథోని తర్వాత మళ్ళీ కొత్తగా ఏ ప్రాజెక్ట్ కూడా ప్రకటించిన దాఖలాలు లేవు. మళ్ళీ బాణీ మార్చుకుని కమర్షియల్ సినిమాతో ఎప్పుడొస్తాడో చూడాలి.

ఇక శ్రీకాంత్ అడ్డాల అనగానే డిజాస్టర్ మిగిల్చిన బ్రహ్మోత్సవం గుర్తొస్తుంది. ముకుంద క్లాసిక్ గా తీసి,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్ మూవీస్ కి ప్రాణం పోసాడు. వెంకీ,మహేష్ లను ఒప్పించి ఈ సినిమా చేయడమే ఓ గ్రేట్. కానీ బ్రహ్మోత్సవానికి సీన్ రివర్స్ అయింది. నెటిజన్స్ ట్రోల్స్ చేసారు. ముఖ్యంగా అడ్డాల తో ఆడుకున్నారని చెప్పొచ్చు. అయితే తమిళ రీమేక్ మూవీగా నారప్ప వెంకీతో ప్రకటించగానే ,శ్రీకాంత్ అడ్డాలపై మళ్ళీ జోకులు పేలాయి. కానీ ఆ మూవీ స్టిల్స్ అదరగొట్టేయడంతో ఈ సినిమాతో నిలదొక్కుకుంటాడని ఆశ.

యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ మూవీస్ తీయడంలో బోయపాటి శ్రీను ని మించినవాడు లేడు. రవితేజ తో తీసిన భద్ర నుంచి ఒకటే ఫార్ములా. బాలయ్యతో , అల్లు అర్జున్ తో ఇలా ఎవరితో తీసినా ఫైట్స్,రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్ తో అదరగొట్టేసింది బోయపాటికి వినయ విధేయ రామ మూవీతో డిజాస్టర్ పెద్దదే పడింది. దారుణంగా ట్రోల్స్ పడ్డాయి. అయితే బాలయ్యతో బోయపాటికి కుదిరినట్టు ఎవరితో కుదరదన్నట్లు తాజాగా బాలయ్య మూవీ టీజర్ చూస్తే అదిరింది. ఈ మూవీతో మళ్ళీ ఇమేజ్ సొంతం చేసుకుంటాడా లేదా అనేది చూడాలి.

గమ్యం మూవీతో మొదలు పెట్టి డిఫరెంట్ మూవీస్ చేసి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన క్రిష్ జాగర్లమూడి వేదం,కంచె ఇలా డిఫరెంట్ మూవీస్ తో తనకంటూ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. గౌతమీ పుత్ర శాతకర్ణి పేరిట తీసిన హిస్టారికల్ మూవీ క్రిష్ కృషికి నిదర్శనం. కానీ పాన్ ఇండియా మూవీగా మణికర్ణిక స్టార్ట్ చేసి,అందులోంచి తప్పుకుని,బాలయ్య పిలిచి ఎన్టీఆర్ బయోపిక్ అప్పగించడం,వంటి పరిణామాలు అచ్చిరాలేదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పీరియాడిక్ స్టోరీ తో మూవీ తీయబోతున్నాడు. ఇప్పటికే పీఎస్ పీకే 27పేరుతొ అధికారికంగా పోస్టర్ కూడా వచ్చేసింది. పవన్ ఎప్పుడూ టచ్ చేయని హిస్టారికల్ మూవీని ఎలా డీల్ చేస్తాడో క్రిష్.

యువ దర్శకుడు సుజిత్ కేవలం రెండే రెండు సినిమాలు చేసాడు. రన్ రాజా రన్ సినిమా అద్భుతంగా తీసాడు. అందరూ పొగిడారు. కానీ సాహో మూవీకి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. అయితే ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన సాహో మూవీని సుజిత్ డైరెక్ట్ చేసి చాలా అనుభవం గడించేసాడు. భారీ అంచనాలు,పాన్ ఇండియా మూవీ, భారీ బడ్జెట్ ఇలా అన్నింటా సుజిత్ క్రేజ్ ఎంతో ఊహించేలా చేసింది. మనదగ్గర నెగెటివ్ టాక్ రావడం,మిగిలిన చోట్ల ఇలా చాలా అనుభవమే మిగిలింది. అయితే అనుకోకుండా మరో బిగ్ ప్రాజెక్ట్ సుజిత్ చేతికి వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. లూసిఫర్ రీమేక్ దొరకడం నిజంగా అదృష్టమే. మరి ఈమూవీ ఎలా చేస్తాడో చూడాలి.