Health

బరువు తగ్గాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ?

అధిక బరువు తగ్గించుకోవటానికి కడుపు మాడ్చుకొని ఉపవాసాలు చేయనక్కరలేదు. కడుపు నిండా తింటూనే అనుకున్నా సమయంలో అనుకున్నంత బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలని అనుకున్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము.

నేరుగా భోజనం చేయకుండా,ముందుగా కూరగాయలతో తయారుచేసిన సలాడ్ లేదా సూప్ తీసుకోవాలి. ఆ ఆతర్వాత భోజనం చేయాలి. భోజనానికి ముందు వీటిని తీసుకోవటం వలన తక్కువ ఆహారం తీసుకుంటాము. అలాగే చాలా సేపు కడుపు నిండిన భావన ఉంటుంది.

ఆకలి వేసిన ప్రతిసారి చిరుతిళ్ళు తినటం కన్నాహేల్ది స్నాక్స్ తీసుకుంటే మంచిది. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత సాయంత్రం కాఫీ,టీ లకు బదులు పళ్ళ రసాలను తీసుకోవాలి. వీటిలో ఉండే పైబర్,ప్రోటీన్ మీ కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి.

ప్రోటిన్స్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవటం ద్వారా ఆరోగ్యంతో పాటు అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. ఉదయం,సాయంత్రం సమయంలో నానబెట్టిన శనగలు,పెసలు,వేరుశనగ పప్పులను తినటం వలన శరీరానికి కావాల్సిన ప్రోటిన్స్ లభించడంతో పాటు ఆకలి లేకుండా చేస్తుంది. వీటితో పాటు వెన్న తీసిన పల్చని మజ్జిగను కాఫీ,టీ లకు బదులుగా త్రాగాలి.

రోజు తీసుకొనే కూరగాయలే కదా అని నిర్లక్ష్యం చేయకుండా పైబర్ ఎక్కువగా లభ్యమయ్యే కూరగాయలు,ఆకుకూరలు మీ మెనులో చేర్చుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలని అనుకునే వారికీ పైబర్ బాగా పనిచేస్తుంది.