Beauty Tips

చర్మం ప్రకాశవంతముగా ఉండటానికి తీసుకోవలసిన కొద్దిపాటి జాగ్రత్తలు

వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి అనేవి చర్మ కాంతిని నశింపచేసి సహజ అందాన్ని దెబ్బతీస్తాయి. ఫలితంగా చర్మం కాంతి విహీనంగా తయారవుతుంది. చర్మ కాంతి అనేది పుట్టుకతో వచ్చేదే అయినా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చర్మ కాంతిని మరింత పెంచుకోవచ్చు. దీనికోసం పెద్దగా కష్టపడనక్కర్లేదు. రోజులో ఓ పావు గంట సమయం కేటాయిస్తే చాలు. మిల మిల మెరి సే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

ముఖం శుభ్రం చేసుకోవడానికి క్లిజినింగ్ క్రీమ్ ఉపయోగించండి. ఇది ముఖం లోపలి దాకా శుభ్రం చేసి ముఖాన్ని కాంతివంతంగా చేయడానికి దోహదం చేస్తుంది. వీలయినన్ని సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండండి. ముఖం శుభ్రం చేసుకోవడానికి స్ట్రాంగ్ సబ్బును ఉపయోగించకండి. శరీరం మొత్తం మీద చర్మం కంటే ముఖం మీద చర్మం సున్నితంగా ఉంటుంది.

మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉపయోగించడం వలన చర్మం మరింత మృదువుగా మారుతుంది. 20 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలకు లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ సరిపోతుంది.

బాదాం పప్పులన్ని నానబెట్టి పచ్చిపాలతో కలిపి ముద్దలా చేసుకొని దాన్ని ముఖానికి పట్టించి రాత్రంతా ఉంచుకోని తెల్లవారిన తర్వాత గోరువేచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. క్రమం తప్ప కుండా కొన్ని రోజుల పాటు ఈ విధంగా చేస్తే ముఖం నిగనిగలాడుతూ ఉంటుంది.

శనగపిండి, పచ్చిపాలు, పసుపు కలిపి ముద్దగా చేసుకోని శరీరానికి పట్టించి పావు గంట అనంతరం స్నానం చేయాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేసినట్టయితే చర్మం కాంతి రెట్టింపు అవుతుంది.

బంగాళాదుంపల రసాన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకొన్నా మంచి ఫలితం లభిస్తుంది.