Health

డిప్రెషన్ తగ్గించుకోవటానికి సుళువైన మార్గాలు

చాలా మంది ఎదుర్కొంటున్న సాదారణమైన అసాదారణ సమస్యగా డిప్రెషన్ ను చెప్పవచ్చు. చాలా మందికి డిప్రెషన్ మీద అవగాహన లేకపోవుట వలన సమస్య తీవ్రమై చివరకు అది ఆత్మహత్య చేసుకోనేదాకా వెళ్ళుతుంది. డిప్రెషన్ గురించి అవగాహన కొరకు మరియు దానిని ఏలా గుర్తించాలో తెలుసుకుందాము.

* అకారణంగా దుఖం,విచారంగా ఉండటం,మూడిగా ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటం డిప్రెషన్ లక్షణాలుగా గుర్తించాలి.
* కారణం ఉన్నా లేకపోయినా అకారణంగా చిన్న పిల్లల మాదిరిగా రోడించుట
* శరీర బరువులో అసాదారణ మార్పులు
* నిద్రలో అసమానతలు
* చిన్న చిన్న పనులకు త్వరగా అలసిపోవుట
* ప్రతి చిన్న చిన్న విషయాలకు అత్మన్యునతతో ఉండుట
* తరచూ ఆత్మహత్య చేసుకోవాలని కోరిక కలగటం

వీటిని డిప్రెషన్ లక్షణాలుగా గుర్తించాలి. అయితే కొన్ని పద్దతుల ద్వారా డిప్రెషన్ ను అదికమించవచ్చు.

* ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలిసి ఉండటం అలవాటు చేసుకోవాలి.
* బాగా డిప్రెషన్ అనిపించినప్పుడు స్నేహితులను కలవండి.
* ఈ పద్ధతి ఇష్టం లేకపోతె టీవిలో వచ్చే కామెడి సీరియల్స్ చూడండి. అప్పుడు తప్పకుండ మూడ్ మారుతుంది.
* షాపింగ్ కూడా మీ మూడ్ ను మార్చి డిప్రెషన్ నుంచి బయట పడటానికి మంచి సాధనం. స్నేహితులతో వెళ్లిన సరే లేదా మీరు ఒక్కరైన వెళ్ళవచ్చు.
పై పద్దతులను పాటించిన కూడా డిప్రెషన్ తగ్గకపోతే తప్పనిసరిగా మీ ప్యామిలీ డాక్టర్ ను సంప్రదించాలి.