ఈ స్టార్ హీరో ని గుర్తు పట్టారా… వైరల్ అవుతున్న పిక్

టాలీవుడ్ లో ప్రభాస్ ఎస్ పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మహేష్ బాబు అల్లు అర్జున్ మొదలైనవారు స్టార్ హీరోలు గా కొనసాగుతున్నారు. వీరు టాలీవుడ్ కి రాకముందు చేసిన ఫోటో షూట్స్ లలో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి.

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాహుబలి సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కెరీర్ ప్రారంభంలో తీయించుకున్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. గడ్డం మీసం లేకుండా గన్ పట్టుకొని ఉన్న ప్రభాస్ ఫోటో ని అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మొదట్లో సినిమాలు సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నిదానంగా పుంజుకుని స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు.