వారసులను పరిచయం చేసే అవకాశం వదులుకున్నదర్శకులు ఎంత మంది ఉన్నారో తెలుసా ?
ఇప్పుడు ఎక్కువమంది నటీనటులు వారసులే వస్తున్నారు. అయితే స్టార్ హీరోల పిల్లలను హీరోలుగా ఎంట్రీ ఇప్పించాలని టాలీవుడ్ డైరెక్టర్ లు కోరుకోవడం సహజం. అదో మజాగా ఉంటుంది. అయితే ఒక్కోసారి చేతిదాకా వచ్చి మరొకరికి ఆ ఛాన్స్ పోతుంది. అలా తమకు వచ్చిన ఛాన్స్ మిస్సయిన డైరెక్టర్లను పరిశీలిస్తే, నిన్ను చూడాలని సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చాడు. కానీ నిజానికి స్టూడెంట్ నెం.1తో రాజమౌళి పరిచయం చేయాల్సి ఉంది. మొత్తానికి ఆ తర్వాత మూడు సినిమాలు వర్కవుట్ అయ్యాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను ముందుగా రాజమౌళికే ఇచ్చాడు. అయితే చరణ్ బాడీ లాంగ్వేజ్ ఏంటో తెలియకుండా సినిమా చేయలేనని చెప్పి, రెండో సినిమా మగధీర చేసాడు. ఇప్పుడు తారక్ ,చెర్రీలతో ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ తీస్తున్నాడు.
కాగా సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి నట వారసుడు వస్తున్నాడంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అన్ని అంచనాలు తాను తట్టుకోలేనంటూ కృష్ణవంశీ పక్కకు తప్పుకున్నాడు. దాంతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత మురారి మూవీ మహేష్ తో కృష్ణవంశీ తీసాడు. నిజానికి యమలీల కథ మహేష్ కోసం తయారు చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి ముందుగా కృష్ణకు చెప్పాడు. కానీ చదువుకుంటు న్నాడనే ఉద్దేశ్యంతో నో చెప్పడంతో మహేష్ ను లాంచ్ చేసే ఛాన్స్ కృష్ణారెడ్డి కోల్పోయాడు ఇక క్రియేటివ్ డైరెక్టర్ తేజ మంచి పీక్‌లో ఉన్నపుడు జయం మూవీని అల్లు అర్జున్ తో తీయాలనుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కారణం ఏమిటో గానీ, అందులోకి నితిన్ వచ్చాడు. ఇక వెంకటేష్ లాగానే రానాను కూడా రాఘవేంద్రరావు చేతుల్లోనే పెట్టాలనుకున్నా, అనుకోని కారణాలతో లీడర్ మూవీతో శేఖర్ కమ్ముల చేతిలోకి పడ్డాడు.
జోష్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చినా కూడా చిరుత చూసిన తర్వాత తన వారసుడిని కూడా పూరీ చేతుల్లోనే పెట్టాలని నాగార్జున భావించినప్పటికీ కథ కుదరక కాంబినేషన్ సెట్ కాలేదు. అంతేకాదు, కొత్త బంగారు లోకం కథ ముందు నాగ చైతన్య కోసం దిల్ రాజు పక్కనబెట్టాడు. కానీ మరీ ఇంత సాఫ్ట్ కథ వద్దని నాగ్ రిజెక్ట్ చేసాడు. ముకుంద కంటే ముందు కూడా క్రిష్ చెప్పిన కథ వరుణ్ తేజ్‌కు నచ్చినప్పటికీ మెగా కుటుంబం నుంచి వచ్చే హీరోపై అంచనాలు ఎక్కువగా ఉన్నందున కుదరలేదు. మనం సినిమా చివర్లో అఖిల్‌ను దర్శకుడు విక్రమ్ కే కుమార్ పరిచయం చేసాడు. ఆ తర్వాత తొలి సినిమాను కూడా ఆయనే తీయాలనుకున్నా, మాస్ ఎలిమెంట్స్ ఉండాలన్న ఉద్దేశ్యంతో వినాయక్ లైన్‌లోకి వచ్చాడు. అయితే రెండో సినిమా హలో విక్రమ్‌తోనే చేసినా క్లిక్ కాలేదు.