Health

స్వీట్లు తిని వెంటనే నీళ్లు తాగకపోతే ఏమవుతుందంటే?!!

చాలామంది దంతాల ఆరోగ్యం గురించి సరిగా పట్టించుకోరు. నిజానికి మన ముఖానికి అందం తెచ్చేది అందమైన, ఆరోగ్యవంతమైన పలువరుస. దీన్ని పరిరక్షించుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలను మరవొద్దు. అవి…
కొందరు దంతాలు తళతళ మెరవాలని ఎక్కువసేపు బ్రష్షింగ్‌ చేస్తుంటారు. ఇది దంతాల సున్నితత్వాన్ని దెబ్బతీస్తుంది. అందుకే దంతాలను రెండు నుంచి మూడు నిమిషాల మించి బ్రష్‌ చేయకూడదు.

కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌ను తాగడం వల్ల దంతాల సెన్సిటివిటీ దెబ్బతింటుంది. అంతేకాదు దంత క్షీణత సంభవిస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అంతా కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.

చాలామంది మసాలా వంటలు ఇష్టపడతారు. వీటి ప్రభావం దంతాల మీద పడుతుంది. అందుకే నోటిని ఉప్పు వేసిన గోరువెచ్చటి నీటితో పుక్కిలిస్తే మంచిది.

స్వీట్లకు దూరంగా ఉండాలి. ఎక్కువ స్వీట్లు తిని నీళ్లు బాగా తాగకపోతే దంత క్షయం సంభవిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.