Movies

ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…. అయితే వెంటనే చూసేయండి

కరోనా సృష్టించిన భీభత్సం అంతాఇంతా కాదు. అన్ని రంగాలను దెబ్బతీసిన కరోనా సినిమా రంగాన్ని దెబ్బకొట్టింది. లాక్ డౌన్ తో ఇంటికే స్టార్స్ అందరూ పరిమితమ య్యారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు షూటింగ్స్ కి వెళ్తున్నారు. లాక్ డౌన్ పీరియడ్ లో తమ జ్ఞాపకాలను ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇక సందీప్ కిషన్ హీరోగా వచ్చిన బీరువా మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సురభి, ఆ మధ్య మంచు విష్ణు నటించిన ఓటరు మూవీలో నటించింది. ప్రస్తుతం రెండు,మూడు సినిమాలకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అలాగే తమిళంలో యంగ్ హీరో జివి ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా ఈ అమ్మడు చేస్తోందట.

అయితే లాక్ డౌన్ సమయంలో ఇంటిపట్టునే ఉంటున్న ఈ అమ్మడు తన చిన్నప్పుడు సైకిల్ తొక్కే ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో విశేషంగా అలరిస్తోంది. లక్ష లైకులు,కామెంట్స్ పడ్డాయి. చిన్నప్పుడు క్యూట్ గా ఉందంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే సినిమాల సెలక్షన్ విషయంలో సరిగ్గా వ్యవహరించకపోవడం వలన ఇండస్ట్రీలో సురభికి అనుకున్న గుర్తింపు రాలేదని టాక్.