మోహన్ బాబు కి ఆ హీరోయిన్ అంటే భయమా?

తెలుగు సినీ పరిశ్రమలో మోహన్‌బాబుకు ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ ఉంది. తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే మోహన్‌బాబు పేరు చెపితే చాలా మంది భ‌య‌ప‌డ‌తారు. మోహ‌న్‌బాబు క్రమశిక్షణకు, ముక్కుసూటితనానికి మారు పేరు. మోహ‌న్‌బాబు ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడ‌తారు. దీంతో మోహ‌న్‌బాబు అంటే చాలా మందికి భ‌యం.

ఇక మోహ‌న్‌బాబు క్ర‌మ‌శిక్ష‌ణ మెచ్చే ఎంతో మంది సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఆయ‌న‌కు ఎంతో గౌర‌వం ఇస్తుంటారు. మోహ‌న్‌బాబు అంటే ఇండ‌స్ట్రీలో చాలా మంది భయపడతారు. బయటివారే కాదు.. మనోజ్‌, విష్ణు, లక్ష్మీ కూడా ఇప్పటికీ తమ తండ్రి అంటే భయమేనని చెబుతుంటారు.

మరి, ఇంతమందిని భయపెట్టే మోహన్‌బాబు ఎవరంటే భయపడతారో తెలుసా ? ఈ ప్రపంచంలో మోహన్‌బాబును భయపెట్టే ఏకైక హీరోయిన్ ఒక‌రు ఉన్నారు. హీరోయిన్ అంటే ఎవ‌రా అని తెగ ఆలోచించి బుర్ర‌బ‌ద్ద‌లు కొట్టుకోవ‌ద్దు. మోహ‌న్‌బాబు నిజ‌జీవిత హీరోయిన్ ఆయన భార్య నిర్మలా దేవి అంటే ఆయ‌న‌కు భ‌య‌మ‌ట‌.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.. ‘ఈ ప్రపంచంలో నేను భయపడేది నా భార్యకు మాత్రమేన’ని అసలు రహస్యాన్ని బయటపెట్టారు.

error: Content is protected !!