అన్నయ్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ బాబు

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరుపడ్డ సూపర్ స్టార్ కృష్ణ నటించిన చాలా సినిమాల్లో కృష్ణ చిన్నప్పటి పాత్రల్లో బాలనటుడిగా పెద్ద కొడుకు రమేష్ నటించాడు. ఇక పెద్దయ్యాక హీరోగా కూడా కొన్ని సినిమాలు చేసాడు. కొన్ని హిట్ అయినాసరే, ఎందుకో సరిగ్గా ఇండస్ట్రీలో క్లిక్ కాలేదు. 1987 సంవత్సరంలో హీరోగా అరంగేట్రం చేసిన రమేష్ బాబు 1997 వరకు దశాబ్ధం పాటు ఇండస్ట్రీలో ఉన్నాడు. అంతేకాదు, రమేష్ బాబు, కృష్ణ లతో కల్సి మహేష్ బాబు కూడా నటించిన ముగ్గురు కొడుకులు సినిమా కూడా వచ్చింది.

ఇక గూఢచారి 117లో కూడా మహేష్ బాబు బాలనటుడిగా అదరగొట్టాడు. అందుకే కృష్ణ వారసుడు మహేష్ బాబు అని అప్పుడే అందరూ డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్టు రమేష్ ఫెయిల్ కావడం , కృష్ణ వారసత్వ నటనను ప్రిన్స్ మహేష్ బాబు అందిపుచ్చుకుని, తన టాలెంట్ తో సూపర్ స్టార్ అయ్యాడు. ఇక మంగళవారం రమేష్ బాబు పుట్టినరోజు ని పురస్కరించుకుని మహేష్ తన సోదరుడికి శుభాకాంక్షలు తెలిపారు.

నాటి క్లాసిక్ మూవీలో అన్నయ్య రమేష్ తో కలిసి నటిస్తున్నప్పటి స్టిల్ ఒకటి షేర్ చేసాడు. “ఇక్కడ నా అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా అభ్యాసంలో కొంత భాగం అతని నుండి వచ్చిందని సులభంగా చెప్పగలను. క్రమశిక్షణ, అంకితభావం, అభిరుచి అతను నిస్వార్థంగా నాకు ఇచ్చాడు. మీకు గొప్ప ఆరోగ్యం, చాలా ఆనందం దక్కాలని కోరుకుంటున్నా” అని మహేష్ ట్వీట్ చేసాడు. ఇటీవలే సోదరి ప్రియదర్శిని బర్త్ డే సందర్భంగా ఘట్టమనేని కుటుంబం కలిసి లంచ్ చేశారు. ఇంతలోనే రమేష్ బాబు బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో వేదికగా విషెష్ చెప్పడం ఫాన్స్ కి ఆనందమే.

error: Content is protected !!