బిగ్ బాస్ లో ఎంత మంది అర్జున్ రెడ్డిలు ఉన్నారో తెలుసా ?

స్టార్ మా ఛానల్ లో కింగ్ నాగార్జున హోస్ట్ గా తెలుగులో బిగ్ బాస్ 4వ సీజన్ ప్రస్తుతం నడుస్తోంది. అయితే బిగ్ బాస్ షో అనగానే కొందరికి వివాదాస్పదంతో పాటు కొందరికి వినోదంగా ఉంటోంది. ఒకరు నవ్వితే, మరొకరు ఏదో అల్లరి చేస్తారు , మరొకరు డాన్స్ చేస్తారు, ఇంకొకరు కయ్యం పెట్టుకుంటున్నారు. ఇలా రకరకాలా విన్యాసాల మేళవింపుతో బిగ్ బాస్ షో నడుస్తోంది. ప్రతి ఎపిసోడ్ లోనూ అర్జున్ రెడ్డి రివీల్ అవుతున్నట్లు ఉంటుందని అంటున్నారు. ఇలా ఫైర్ బ్రాండ్ గా ఉన్నవాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంటోందని టాక్.

సీజన్ వన్ లో విన్నర్ గా నిల్చిన నటుడు శివ బాలాజీ కూడా సీరియస్ గానే ఉన్నాడు. నీళ్లు రాలేదని హోస్ట్ మీద కూడా కోపం తెచ్చుకున్నాడు. సీజన్ 2లో చూస్తే , హీరో తనీష్ కోపానికి నిర్వచనంగా వ్యవహరించాడు. కౌశల్, నూతన నాయుడులతో తరచూ గొడవకు దిగుతూ అడ్డూ అదుపు లేకుండా మాట్లాడేవాడు. ఇక దీప్తి సునయనతో లవ్ ఎఫైర్ కూడా వర్కవుట్ అయింది. టాప్ త్రి కి చేరుకున్నాడు. ఫాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉండేది. ఇక తేజస్వి కూడా రుసరుస లాడుతూ ఉండేది. 7వ వారంలో వెళ్ళిపోయింది.

సీజన్ త్రీలో ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రిని ప్రవేశపెట్టారు. మొదట్లో ఆమె బాగానే ఉన్నట్లు కన్పించినా , సహ కంటెస్టెంట్ రవికి కూడా చుక్కలు చూపించింది. రోహిణి తదితరులను ఆడేసుకుంది. అందరినీ వణికించిన ఈమెను ఆడియన్స్ తొందరగానే బయటకు పంపేశారు. ఇక ప్రస్తుత సీజన్ లో సోహెల్ మొదట్లో స్లో గా కనిపించినప్పటికీ ఇప్పుడు వయొలెంట్ అయ్యాడు. యితడు మాట్లాడేప్పుడు తెలీకుండానే బూతులు కూడా మాట్లాడేసి ఆశ్చర్య పరుస్తున్నాడు. నరాలు కట్ అయ్యేలా మాట్లాడతాడని స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అవుతూ చెప్పింది. ప్రస్తుతం 5వ కెప్టెన్ గా హౌస్ లో ఉన్నాడు.