సమంత.. హీరోయిన్ ఎలా అయిందో తెలిస్తే షాక్ అవుతారు!

అందం, అభినయం, తన అమాయకమైన మొహంతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఎంతో మాయ చేసింది అందాల ముద్దుగుమ్మ సమంత. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ భామ త్వరలో అక్కినేని ఇంట కోడలిగా అడుగు పెట్టనుంది.

వచ్చిన తక్కువ కాలంలోనే మంచి విజయలను అందుకోని.. మంచి పేరు సొంతం చేసుకుంది. అయితే అసలు సమంత సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది.. ఎలా హీరోయిన్ అయిందో తెలిస్తే షాక్ అవుతారు. చెన్నై లోని స్టెల్లా మేరీస్ కాలేజ్ లో సమంత డిగ్రీ చదువుతున్నప్పుడు తన స్నేహితురాలి పెళ్ళికి వెళ్లింది. అక్కడ అందిరిలా ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే ఆ ఫోటోలు మరుసటి రోజు పేపర్లో వచ్చింది. అలా పబ్లిష్ అయిందని ఓ షాప్ ఓనర్ చెబితే గాని చూసుకోలేదు.అతనే సమంతను వెతుక్కుంటూ వచ్చి తన బట్టల షాప్ కి పబ్లిసిటీ చేయమంటే సరదాగా చేసింది.

అది చూసిన ఓ కంపెనీ వాణిజ్య ప్రకటన లో నటించే చాన్స్ ఇచ్చింది. ఆ యాడ్ చూసిన మూవీ డైరెక్టర్స్ తమ సినిమాల్లో చిన్న రోల్ చేసే చాన్స్ ఇచ్చారు. అప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూసిన ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తాను దర్శకత్వం వహిస్తున్న ఏ మాయ చేసావే చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్ సమంత జీవితాన్నే మార్చేసింది. ఆ తర్వాత సమంతకు వరస హిట్లు, ఆఫర్లు వచ్చాయి. ఇంకేముందు సమంత టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

error: Content is protected !!