Health

బాదాం,ఖర్జురాలు కలిపి తీసుకుంటే…..షాకింగ్ ప్రయోజనాలు

Dates and Almond Benefits :ఖర్జూర పండ్లలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోజూ ఖర్జూరాలను తీసుకోవడం ద్వారా ఒక రోజుకు సరిపడా పోషకాహారం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఖర్జూరాల్లో కాపర్, పొటాషియం, పీచు, మాంగనీస్, విటమిన్ బి6, మెగ్నీషియం వంటివి వున్నాయి. విటమిన్ ఎ ఇందులో ఉండటం ద్వారా కంటి దృష్టి లోపాలను దూరం చేసుకోవచ్చు.

ఖర్జూరాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. పేగు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి. ఖర్జూరాలతో పాటు బాదం పప్పుల్ని పాలలో కలుపుకుని మరిగించి తీసుకుంటే నరాల బలహీనతకు చెక్ పెట్టొచ్చు. జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. ఖర్జూరాల్లోని మెగ్నీషియం హృద్రోగ వ్యాధులను తగ్గిస్తుంది. మహిళలు ఖర్జూరాలను గర్భధారణ సమయంలో తీసుకుంటే.. ప్రసవానంతరం శరీర బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

ఖర్జూర పండ్లలోని పొటాషియం గుండెను రక్తాన్ని సక్రమంగా అందేలా చేస్తుంది. రక్తపోటును నియంత్రించేందుకు ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి. ఖర్జూరాల్లోని ఐరన్ శరీరంలోని రక్తకణాల సంఖ్యను పెంచుతుంది. రక్తహీనతను తొలగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులు రోజూ రెండు ఖర్జూరాలను తీసుకుంటే శరీరానికి పోషకాలు లభించడంతో పాటు బలం చేకూరుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."