Health

హోటల్ లో చికెన్ పకోడి తింటున్నారా?కొంచెం ఆగండి ఇది చదివాక

chicken pakora bad effects :ప్రతీ ఇంట్లోనూ కోడిమాంసాన్ని ఇష్టంగా తింటుంటారు. చికెన్ తింటే ప్రమాదమని తెలిసినా ఇప్పడు సర్వసాధారణం అయిపోయింది. కోడి త్వరగా బలంగా ఎదగాలని పలు రకాల ఇంజక్షన్లు చేయిస్తున్నారు. రసాయనాల ప్రభావం కోడి చర్మం మీద అధికంగా ఉంటుందని సర్వేలో తెలిపారు. ఎక్కువ శాతం మంది కోడి చర్మాన్ని తీసేసి మాంసంను మాత్రం వాడుతుంటారు. ఇలా ప్రజలు ఉపయోగించని కోడి వ్యర్థాలను పలువురు వ్యాపారస్తులు తెలివిగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

కోడి అమ్మగా మిగిలిన వ్యర్థాలను చికెన పకోడి, హోటల్స్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ నిర్వాహకులు అతి త క్కువ ధరకు కొని సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం కోడి చర్మం, కాళ్లను అతి తక్కువ ధరకు కొంటున్నారు. ఇలా చికెన పకోడి 100 గ్రాములు రూ. 40 లు చొప్పున 1 కేజీ రూ. 400 వరకు అమ్ముతున్నారు. వ్యర్థాలు అని తెలియకుండా లేకుండా మొక్కజొన్న పిండి, మసాలాలు దట్టంగా పట్టిస్తున్నారు. దీంతో బరువు పెరగడంతో పాటు వ్యర్థాలు కూడా తెలియకుండా మసి పూసి మారేడు కాయ చేస్తున్నారని చెబుతున్నారు. నూనెలో వేగిన తరువాత ఏ అవశేషం ఏదో కనిపెట్టడం కష్టతరమే కాబట్టి వ్యాపారులకు హద్దు అదుపులే కుండా పోయింది.

పలు హోటల్‌, ఫాస్ట్‌ పుడ్‌ సెంటర్‌ నిర్వాహకులు ఇదే తంతు కొనసాగిస్తున్నారు. బిర్యానీతో పాటు ఇవ్వాల్సిన శేరువా అత్యంత నాసిరంగా తయారు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చికెన దుకాణాల నుంచి తయారు చేసిన కోడి మెడ, తల, ఇతర బాగాలతో చికెన శేరువాను తయారు చేసి బిర్యానితో పాటు అంట గట్టేస్తున్నారు. పైగా శేరువాకు అధిక ధర కూడా వసూలు చేస్తున్నారు.

కోడి పేగులను ఇతర వ్యర్థాలను మటన బోటి పేరు చెప్పి బహిరంగంగా సొమ్ము చేసుకుంటున్నారు. పలు ఆకుకూరలు కోడి పేగులను కలిపి మటన బోటి పేరుతో నిలువు దోపిడికి పాల్పడుతున్నారు. ఇటువంటి అవశేష వ్యర్థాలను తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కోళ్ల ఫారం నిర్వాహకులు కోడి ఎదగడానికి అవసరమైన దాణా కన్నా ఇంజక్షన్లు, టాబ్లెట్‌ ల ను ఎక్కువగా ఉపయోగించి త్వరగా ఎదిగేలా చేస్తారని అందరికీ తెలిసిన విషయమే.