Health

భోజనం చేసిన వెంటనే నీళ్ళు తాగితే ఇక అంతే

Food after drink water :మానవ శరీరంలో అనేక భాగాలుంటాయి. కానీ మన శారీరక దఃఖాలకి ప్రధాన కారణం కడుపు. అదేనండీ పొట్ట భాగం. మనకు వచ్చే శారీరక దుఃఖాలలో 90% పొట్ట వల్ల వస్తాయంట. 10% మిగిలిన అవయవాల వల్ల వస్తాయంట. అంటే మోకాళ్ళ వల్ల, భుజాల వల్ల, హృదయం వల్ల, మెదడు వల్ల ఇలాంటివి 10% మాత్రమే, ఎయితే ఎక్కువ రోగాలకి చికిత్స కంటే, రోగాల బారిన పడకుండా ఉండటమే ఎంతో ప్రధానం అంటారు.

మనం తిన్న ఆహారం పొట్టలో సక్రమంగా జీర్ణం అయిన తర్వాతనే, అది రసంగా మారి, మాంసం, మజ్జ, రక్తము, వీర్యము, మేద, మలం, మూత్రము ఇలా తయారవుతాయి. కాబట్టి తినడం ఎంత ప్రధానమో సక్రమంగా జీర్ణమవటం అంతే ప్రధానం.

“భోజనాంతే విషం వారీ”, అంటే భోజనం చివర నీరు త్రాగడం విషంతో సమానము. మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది. అక్కడ అగ్ని( జఠరాగ్ని ) ప్రదీప్తమవుతుంది. ఆ అగ్ని తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది. ఇది ప్రధానమైన అంశం.

మనం నోట్లో మొదటి ముద్ద పెట్టుకోగానే లాలజలం ఊరుతుంది. వెంటనే ఆహారాన్ని పచనం చేయడానికి జఠరాగ్ని ప్రజ్వలిస్తుంది. ఇదేసమయంలో మనం గటగటా నీళ్లు తాగితే, ఆ నీరు జఠరాగ్నిని చల్లబరుస్తుంది. ఇక తిన్న భోజనం అరగదు, కుళ్ళి పోతుంది. ఆ కుళ్ళిన ఆహారం వలన విష వాయువులు పుట్టి 103 రోగాలకు కారణం అవుతుంది.

మొట్టమొదట గ్యాస్ ట్రబల్, గొంతులోమంట, గుండెలో మంట, ఎసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్ మొదలయిన వన్నీ వస్తాయట. చివరగా వచ్చేది క్యాన్సర్. ఆహారం సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలు ఉండదు. కాబట్టి భోజనం చేసిన వెంటనే నీరు త్రాగకూడదు. అందుకే మనం కూడా ఈనియమం పాటించి రోగాలకు దూరంగా ఉందామా.?

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."